27.7 C
Hyderabad
April 30, 2024 10: 01 AM
Slider మెదక్

బంగారం షోరూమ్స్ లో వస్తువులు కొంటే అనారోగ్యం గ్యారెంటీ

#goldmurchents

బంగారం షోరూమ్ లలో వస్తువులు కొని మీ ఆరోగ్యాల మీదికి తెచ్చుకుని అనారోగ్యం పాలు  కాకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎప్పటికైనా నమ్మకం ఉన్న స్వర్ణకారుల వద్దనే బంగారు అభరణాలు తయారు చేయించుకోవాలని సిద్దిపేట స్వర్ణకార సంఘం అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం, సిద్దిపేట స్వర్ణకార సంఘ సభ్యులు అన్నారు.

సిద్దిపేటలోని మహమ్మాయి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం సిద్దిపేట స్వర్ణకార సంఘ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం షోరూమ్ లలో వస్తువులు కొనొద్దని, అనారోగ్యం పాలుకావొద్దని వినియోగదారులను కోరారు. ఎందుకంటే,  రెడీమేడ్ షోరూమ్ లలో కొన్న వస్తువులలో  ఇరిడియం మిక్సింగ్ వల్ల భయానకమైన చర్మ రాపిడి, రేడియేషన్ వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రీయంగా నిరూపించబడిందని తెలుసుకోలన్నారు. గతంలో ఆధారాలతో జరిమానాలు కూడా విధించారని, తూకంలో మోసంతో కూడిన అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

డైమండ్ జ్యువలరీ  విషయంలో అదే అదనoగా ముత్యాలు రాళ్లు బంగారం తూకం విషయంలో రసీదు రాసి ఇచ్చిన అందులో చెప్పేది ఒకటి వస్తువ ఆభరణంలో ఉండేది ఒకటిగా నాణ్యతలో తెలివిగా పసిగట్టలేని విధంగా ఖచ్చితమైన మోసాలు చేస్తారు వారికి ప్రత్యేకంగా శిక్షణతో వ్యాపారంలో మోసాలు చేస్తారని వివరించారు.

ఒక పెద్ద కార్పొరేట్ జువెలరీ షోరూమ్ నడపాలంటే,  మామూలు విషయం కాదని, కొన్ని లక్షల రూపాయల  ఖర్చులు.. యాజమాన్యం వాళ్ల ఇంట్లో నుండి జేబులో నుండి తీయాలి. కానీ., డబ్బులు తీసి ఈ ఆఫర్ అని, ఆఫర్లు పెట్టి తక్కువ ధరకు అందిస్తామని మోసపూరిత ప్రకటనలు చేస్తారని గ్రహించాలని ఒకసారి నిదానంగా ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవన్నీ షోరూం కిరాయి, అందులో పని చేసే వక్తుల మెయింటేనెన్స్ వారి జీత భత్యాలు, కరెంట్ బిల్లు తదితర నిర్వహణ ఖర్చులు అన్ని  మీవద్ద నుండి GST, / CGST, టాక్స్ ల రూపంలో తీసుకుంటారని తెలుపుతూ.. పెద్ద షోరూమ్ లలో ప్యూర్ 24crt. క్యారెట్స్ బంగారం ఐటమ్ ఎప్పుడు కూడా  ఇవ్వరని తెలిపారు.

డైమండ్ జ్యువలరీలో సింథటిక్ Czs Uncuts  డైమండ్ & రాళ్లు, కెంపులు పచ్చలు  పెట్టి, మీ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నారని, ఒక ఆభరణం తయారీ స్వర్ణకారునితో పోలిస్తే షోరూం జువెలరీ  91.6%   22crt.. హల్ మార్క్.. ఆభరణాలు తరుగు విషయంలో అధిక వ్యత్యాసం ఉంటుంది. విక్రయ విధానంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. 3,4℅ తరుగు తీసుకునే చోటా 10% నుండి 12%  పర్సెంటేజ్ వరకు తరుగు మజూరిలు అదనంగా వినియోగదారుడి పైన రుద్దుతారు. గతంలో స్వర్ణకారుడు (రాగి/వెండి)  సహజమైన పద్దతిలో కలిపి బంగారం పని చేసేవారు.

కానీ ఇప్పుడు షోరూమ్ లో మొత్తం ఇరేడియం / జింక్ లాంటి /యెలాయి.. ముడి సరుకు కెమికల్స్ తో మిక్సింగ్ చేపిస్తు ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తున్నారని, ఆభరణంలో లోపల రాగి తీగలు వైర్లు వీలైనంతవరకూ లోపల దాచి పెట్టి పైన బంగారం డిజైన్ వచ్చే విధంగా తయారీ విషయంలో జాగ్రత్త పడుతూ అమ్ముతారు. ఈ విషయం స్వర్ణకారుల దగ్గరికి వచ్చి ముద్దగా కరిగించినప్పుడు మాత్రమే మీకు నిజం బయటపడి నిర్ధారణ అవుతుంది. 

అలాంటి సంఘటనలు ఈ పరిణామాలు ఎంతో మంది ప్రముఖులకు అనుభవం కూడా అయింది. వార్తలు కూడా వచ్చాయి. గతంలో ఆధారాలతో జరిమానాలు కూడా విధించారు. తిరిగి జ్యువలరీ షాప్ మెట్లు ఎక్కాలంటే భయపడి తలలు బాదుకున్నా  సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

కాబట్టి ప్రజలారా బంగారం  ఆభరణాల విషయంలో కార్పొరేట్ జ్యువెలరీ మోసాలను పసిగట్టగలరని కోరుకుంటూ.. స్థానికంగా ఉంటూ సదరు వినియోగదారులపై ఆధారపడి ఉన్న స్వర్ణకారులు ఉన్నారు,  కాబట్టి ఎప్పటికైనా మీ నమ్మకమైన దారులైన స్వర్ణకారుల వద్దనే అభరణాలు తయారు చేసుకోగలరని కోరారు.

జ్యువెలరీ షోరూము ల పైపై మెరుగులకు మురిసిపోయి కొన్నాళ్లకు వస్తువు చిదగోట్టినాడు నష్టం పోకుండా, బాధ పడకుండా ఉండాలని, అలాగే జ్యువెలరీ  షాపు, స్థానిక  స్వర్ణకారుడు చేసిన ఆభరణాలను పరిగణించి తరుగులు కూలీలు (మాజురి ) వేసుకుని డబ్బులు ఐదు నుండి పది వేల వరకు మీరు మీకుగా లబ్ధి పొందగలరని భావిస్తూ.. ఈ విషయంలో బంగారు ఆభరణాలు, బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు (కస్టమర్లకు) అందరికీ సిద్దిపేట స్వర్ణకారుల ఓపెన్ చాలెంజ్ నివేదనతో పాటు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్, నెమలి చారి, బ్రహ్మం, గాలయ్య ,జగత్ చారి, మోహన్, బ్రహ్మం పవన్,  రవి, విజయ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రయివేటు ఆసుపత్రుల్లో ఇంత ఎదవలు ఉంటారా???

Satyam NEWS

పేదల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు

Bhavani

ప్రధాని మోడీని హత్య చేస్తానని బెదిరించిన యువకుడి అరెస్టు

Satyam NEWS

Leave a Comment