28.7 C
Hyderabad
May 5, 2024 09: 19 AM
Slider హైదరాబాద్

వయోలిన్ డే – అలరించిన వయోలిన్ కచేరీలు

violin

ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ వయోలిన్ డే సందర్భంగా హైదరాబాద్ కి చెందిన నిమ్మగడ్డ సోదరీమణులు నయన, సుమన కచేరీలను నిర్వహించింది. యూ ట్యూబ్ వేదికగా నిర్వహించిన ఈ కచేరీలకు విశేష స్పందన వచ్చింది. ముందుగా నయన తన కచేరీ లో శంకరాభరణ రాగంలో దీక్షితార్ కృతి శక్తిసాహిత గణపతి, తర్వాత రార వేణు గోపాబాల తదితరుల క్రుతులు ఆలపించగా, అనంతరం సుమన విశేషంగా త్యాగరాజ కృతులు గిరిరాజసుత, గానమూర్తి, బంటురీతి కొలువు ఇత్యాదివి వయోలిన్ పై పలికించింది. వయోలిన్ గురువు కొమాండూరి అనంత సౌరిరాజన్ కచేరీని పర్యవేక్షించారు.ఈ కార్యక్రమాన్ని సంస్థ కార్యదర్శి డాక్టర్ మండపాక రవి ఇంటర్నెట్ లో ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా ఆన్లైన్ లోనే నిర్వహిస్తున్నామన్నారు, ప్రభుత్వం నిబంధనలు సడలిస్తే వాటికి లోబడి త్వరలో ప్రత్యక్షంగా కచేరీలను ఏర్పాటు చేస్తామని సంస్థ అధ్యక్ష, కోశాధికారులు ధవళ సర్వేశ్వర రావు, టి.మహిశ్వర రావు తెలియజేశారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద క‌దం తొక్కిన ఆశా వ‌ర్క‌ర్లు

Satyam NEWS

చినుకు రాక

Satyam NEWS

పాకిస్తాన్ పిచ్చి తారాస్థాయికి చేరినట్లే ఉంది

Satyam NEWS

Leave a Comment