28.7 C
Hyderabad
April 28, 2024 09: 35 AM
Slider కవి ప్రపంచం

చినుకు రాక

#Aruna Naradabhatla

కొత్త పాటలతో పిచ్చుకల హడావిడి పరుగు

మసిబూసుకుంటున్న ఆకాశాన్ని చూసి

బంధువుల రాకను గమనించిన  చిన్నపిల్లలై  తలలూపుతూ నిలుచున్న చెట్లు

నిప్పులు రాల్చుతున్న సూర్యుణ్ణి చికాకు పడి

ఆవిరైపోతున్న  కడలి

కరోనా మాటకు కట్టుబడి గిరిగీసుకున్న వృత్తాల్లో నిలబడి చూస్తున్న వేడి మట్టి

సాయంత్రాన్ని వొంపుకున్న నింగి

తడియారి జబ్బుజబ్బుగా చుట్టుకుపోయిన తులసి ,తమలపాకు ముఖాల్లో ఏదో సంతోషం

కొమ్మలపై వాలి తుర్రున ఎగిరి  మళ్ళీ వచ్చి వాలుతున్న పిచ్చుక రెక్కలపై టప్ టప్ శబ్దం

దాని చిట్టితల విదిలిస్తూ అటూఇటూ చూపులు

ఆకులపై టపటపా కురుస్తున్న వాన

డాబా పైనుండి సన్నగా జారుతున్న  నీటిధార

ఎదురుచూపుల్లో

ఉన్న వేసవిని చల్లగా తడుపుతున్న ఆకాశం

గాఢమైన శ్వాసలతో  ఆవిరినవ్వుల్లో మునిగిన భూమిదేహం

ముఖం మాడిన రైతుకు మట్టివానసనే ప్రాణవాయువు

చల్లబడి తేలికైన గాలిసంగీతం

కుండీల్లో నిండిన వాననీళ్ళతో స్నేహం చేస్తున్న మొక్కలు

నేనూ అంతే చేయిచాచి నిలుచున్నా చినుకులను హత్తుకుని తన్మయంగా

వాన…శరీరాన్నే కాదు మనసునూ తడిపేస్తుంది చల్లని కౌగిలింతలో!!

-అరుణ నారదభట్ల, హైదరాబాద్

Related posts

విశ్లేషణ: అంతులేని కథ గా మారుతున్న లాక్ డౌన్

Satyam NEWS

ఘనంగా హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

విద్యార్థులకు ఇంగ్లీషు గ్రామర్ ను సులభతరం చేసిన బిఎన్ఆర్

Satyam NEWS

Leave a Comment