28.7 C
Hyderabad
April 28, 2024 10: 09 AM
Slider ప్రపంచం

పాకిస్తాన్ పిచ్చి తారాస్థాయికి చేరినట్లే ఉంది

#Pakistan Map

పాకిస్తాన్ పిచ్చి పీక్ కు వెళ్లినట్లుంది. భారత భూభాగాలను కూడా కలుపుకుంటూ ఒక మ్యాప్ తయారు చేసుకుంది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్, లద్దాక్ ప్రాంతాలను పాకిస్తాన్ తాజాగా విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్ లో తన ప్రాంతాలుగా చెప్పుకుంది.

అంతే కాదు, గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను కూడా పాకిస్తాన్ కలుపుకుని కొత్త మ్యాప్ విడుదల చేసింది. ఇది వారి రాజకీయ అవివేకానికి నిదర్శనమని భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

జమ్మూ కాశ్మీర్, లద్దాక్ లతో బాటు గుజరాత్ లోని జూనాగఢ్, సర్ క్రీక్, మన్వదార్ ప్రాంతాలు పాకిస్తాన్ తన మ్యాప్ లో చూపించుకున్నది.

జమ్మూ కాశ్మీర్ ఆవల ఉండే చైనా సరిహద్దును కూడా పాకిస్తాన్ తన మ్యాప్ లో చూపించలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ ను కరాకోరంపాస్ వరకూ పొడిగించి పాకిస్తాన్ తన అవివేకాన్ని చాటుకుంది.

Related posts

కాలనీలు బస్తీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర కీలకం

Satyam NEWS

అకాల వర్షం.. అన్నదాతకు తీరని నష్టం

Satyam NEWS

భావితరాల భవిష్యత్తు కోసం పని చేస్తున్న AA ఫౌండేషన్

Satyam NEWS

Leave a Comment