38.7 C
Hyderabad
May 7, 2024 17: 38 PM
Slider ఆదిలాబాద్

అందరి సహకారంతో కరోనా ను అరికట్టాం

Indrakaran 251

నిర్మల్ జిల్లాలో అందరి సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగామని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున డిపిఒ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీకి 50 మాస్క్ లను పంపిణీ  కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ బారిన పడిన 20 మందిలో ఎనిమిది మంది పూర్తిగా కోలుకొని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారిని హోమ్ కోరంటైన్ లో ఉంచి ప్రతిరోజు వైద్యులచే పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

డిశ్చార్జి అయిన వారు ఇంట్లోనే ఉండి ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో వైద్యులు, పోలీసులు, రెవెన్యూ, శానిటేషన్ సిబ్బంది బాగా పని చేస్తున్నారని తెలిపారు. ఇటీవల మున్సిపల్ సానిటేషన్ సిబ్బందికి మాస్కులు, బియ్యం నూనె సరఫరా చేశామని తెలిపారు.

అలాగే గ్రామీణ ప్రాంత సఫాయి కర్మచారులకు కూడా ఆదివారం నుండి సర్పంచ్, వార్డ్ మెంబర్లు, ఎం పి టి సి, జెడ్ పి టి సి ల ఆధ్వర్యంలో బియ్యం, నూనె పప్పు అందించనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు గురికావద్దని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, 1500 రూపాయలు అందిస్తున్నారని తెలిపారు.

వారికి మళ్లీ ఈ నెల కూడా అందిస్తామని తెలిపారు. అలాగే వలస కార్మికులు కూడా ఇబ్బందులు పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం 500 నగదు, నిత్యావసర సరుకులు అందిస్తున్నామని తెలిపారు. సోను, కొండాపూర్ వద్ద రోడ్డు వెంబడి వెళ్తున్న వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండాపూర్ రింగ్ రోడ్డు వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు కే రామకిషన రెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సర్వభూపాల వాహ‌నంపై శ్రీ‌ మలయప్ప స్వామి

Satyam NEWS

సత్య నాదెండ్ల తో మంత్రి కేటీఆర్ భేటీ

Bhavani

ఇళ్ల వద్దనే ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు

Satyam NEWS

Leave a Comment