దేశంలోని అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారులలో ఒకరైన ఎల్ వి సుబ్రహ్మణ్యం త్వరలో నీతి ఆయోగ్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ ఆయన నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున త్వరలోనే నియామకపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.
నియామకపు ఉత్తర్వులు వెలువడితే ఎల్ వి సుబ్రహ్మణ్యం ఈ దేశంలోనే అత్యున్నత స్థానంలోకి వెళ్లినట్లు అవుతుంది. ఎల్ వి సుబ్రహ్మణ్యం అత్యంత నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి. ఆయన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆయనను చీప్ సెక్రటరీ పదవిలోనే కొనసాగించారు.
అయితే కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనను అత్యంత దారుణంగా అవమానించి పదవి నుంచి తొలగించారు. చీఫ్ సెక్రటరీ పదవి నుంచి ఎల్ వి సుబ్రహ్మణ్యాన్ని తొలగించిన ముఖ్యమంత్రి ఆయనకు ఒక అప్రధాన పోస్టును కేటాయించారు. అయితే ఎల్ వి సుబ్రహ్మణ్యం ఆ స్థానంలో చేరలేదు. అప్పటి నుంచి సెలవులో ఉన్న ఎల్ వి సుబ్రహ్మణ్యం కు కేంద్ర ప్రభుత్వం పిలిచి మరీ పోస్టింగ్ ఇస్తున్నది. ఇది అత్యంత కీలకమైన పదవి కావడం గమనార్హం.