రాజధాని కోసం జనం చస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. రాజధాని గ్రామాల్లో నేడు మరో ఇద్దరు గుండె పోటుతో మృతి చెందారు. రాజధాని తరలిపోతోందన్న ఆవేదనలో ఈ ఇద్దరు గుండె పోటు కు గురై మరణించారు. మందడం గ్రామానికి చెందిన సాంబమ్మ అనే మహిళ గత కొద్ది రోజులుగా ఆందోళనలలో పాల్గొంటున్నది. అకస్మాత్తుగా ఆమెకు గుండె పోటు రావడం తో మరణించింది. సాంబమ్మ ప్రతి రోజూ క్రమం తప్పకుండా మహాధర్నాలో పాల్గొంటున్నది.
రాజధాని తరలిపోతున్నదన్న మనోవేదన వల్లే ఆదివారం తెల్లవారు జామన ప్రాణాలు విడిచిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదే విధంగా వెలగపూడిలో అబ్బూరి అప్పారావు అనే రైతు గుండె పోటుతో మరణించాడు. నిన్నటి వరకు వెలగపూడిలో రాజధానికి మద్దతుగా అప్పారావు దీక్షలో పాల్గొన్నాడు. అయితే తరలింపు జరిగిపోతున్నదని తెలుసుకున్న అప్పారావు తుది శ్వాస విడిచాడు.