Slider ప్రపంచం

పాకిస్తాన్ అధికార మార్పిడిలో ‘‘విదేశీ కుట్ర’’ లేదు

#janiliaporter

ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ‘విదేశీ కుట్ర’ జరిగిందనే అభిప్రాయాన్ని పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సి) తోసిపుచ్చుతూ ఒక రోజు క్రితం జారీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి జలీనా పోర్టర్ తెలిపారు. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విలేకరుల సమావేశంలో సీనియర్ US అధికారి ఈ ప్రకటన చేశారు.

కొత్తగా ఎన్నికైన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. సీనియర్ సైనిక మరియు సివిల్ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం గతంలో ఇమ్రాన్ ఖాన్ US ప్రభుత్వంపై చేసిన ఆరోపణ గురించి చర్చించింది.

USలో పాకిస్తాన్ మాజీ రాయబారి అసద్ మజీద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎలాంటి విదేశీ కుట్ర జరగలేదని నిర్ధారించింది. ఈ విషయం పై వ్యాఖ్యానించమని ఒక విలేకరి కోరగా ఆమె ఈవిధంగా స్పందించారు. “ఎలాంటి కుట్రకు సంబంధించిన ఆధారాలు కనుగొనబడలేదు” అని ఎన్‌ఎస్‌సికి ప్రీమియర్ సెక్యూరిటీ ఏజెన్సీలు స్పష్టం చేశాయని ఆమె గుర్తు చేశారు.

“ఎలాంటి విదేశీ కుట్ర జరగలేదు” అని సమావేశం తుది వ్యాఖ్య చేసింది. “పాకిస్తాన్‌తో దీర్ఘకాల సహకారానికి యునైటెడ్ స్టేట్స్ విలువ ఇస్తుందని మరియు బలమైన, సంపన్నమైన ప్రజాస్వామ్య పాకిస్తాన్‌ ప్రయోజనాలు అమెరికాకు కీలకం అని నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను” అని సీనియర్ అధికారి తెలిపారు.

Related posts

కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

Satyam NEWS

వైసీపీ నేత ఆధ్వర్యంలో పేకాట డెన్

Bhavani

కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా మారిన పెగాసస్

Satyam NEWS

Leave a Comment