42.2 C
Hyderabad
May 3, 2024 17: 30 PM
Slider విజయనగరం

2వేల 500 మంది సిబ్బంది తో ఎన్నికల బందోబస్తు

#VijayanagaramPolice

విజయనగరం జిల్లాలో  జరగనున్న ఒక మున్సిపల్ కార్పొరేషను, మూడు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు భద్రతా విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి పోలీసు పరేడ్ గ్రౌండులో జిల్లా ఎస్పీ రాజకుమారీ దిశ మార్గ నిర్దేశం చేసారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ – మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భద్రతా సిబ్బంది రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని, ఎన్నికల విధులను నిష్పక్షపాతంగాను, పారదర్శంగా నిర్వహించాలన్నారు.

ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించామని, మున్సిపల్ ఎన్నికలను కూడా శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు.

మున్సిపల్ ఎన్నికలు జరిగే పోలింగు కేంద్రాలు (స్ట్రైకింగ్ఫో ర్సు )వాహనాలు వెళ్ళేందుకు వీలులేని విధంగా ఉంటే, ద్విచక్ర వాహనాలపై అవసరమైన సమయంలో సంఘటనా స్థలాలకు చేరుకొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ పోలింగు కేంద్రం వద్ద పబ్లిక్ అడ్రసింగు సిస్టమ్ ఉండే విధంగా చూడాలన్నారు.

అదే విధంగా పోలింగు కేంద్రాల్లో వెలుగు ఉండే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టే విధంగా చూడాలన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా సమయస్ఫూర్తితో వ్యవహరించి, సమస్య సద్దుమణిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లుతో దురుసుగా ప్రవర్తించ వద్దన్నారు. పోలింగు కేంద్రాల కు 100మీటర్లు దూరం వరకు సర్కిల్స్ గీసి, ఓటర్లు మినహా మిగిలిన వారెవరూ రాకుండాను, గుమిగూడకుండా చూడాలన్నారు.

ఎన్నికల విధుల్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనదని, పోలింగు కేంద్రాల వద్ద పరిస్థితులను ఎప్పటి కప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషనులో 50 వార్డులకు, బొబ్బిలి మున్సిపాల్టీలో 30 వార్డులు, పార్వతీపురం మున్సిపాల్టీలో 24 వార్డులు, సాలూరు మున్సిపాల్టీలో 29 వార్డులు, నెల్లిమర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయన్నారు.

ఎన్నికల్లో సమస్యలు సృష్టించేందుకు అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగా గుర్తించి, వారిపై 119 కేసులు నమోదు చేసి 1667మందిని మంచి ప్రవర్తన కొరకు బైండోవరు చేసామన్నారు. హిస్టరీ షీట్లు, గత ఎన్నికల్లో కేసులు ఉన్నవారిపై మరో 5 కేసులు నమోదు చేసి, 35 మందిని బైండోవరు చేసామన్నారు.

ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా 526 తుపాకులును స్వాధీనం చేసుకున్నామని, 280 నాన్ బెయిలబుల్ వారంటును ఎగ్జిక్యూట్ చేసామన్నారు.ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకుగాను సుమారు 2500మంది పోలీసు సిబ్బంది, అధికారులను వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.

ఒకొక్క మున్సిపాల్టీలో ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకుగాను డీఎస్పీ, అదనపు ఏస్పీ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించినట్లుగా జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ పి.అనిల్ కుమార్, దిశా మహిళా పి ఎస్ డీఎస్పీ టి.త్రినాథ్, సిసిఎస్ డీఎస్పీ జే.పాపారావు, ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, ఏస్బి సిఐలు ఎన్.శ్రీనివాస రావు, రుద్రశేఖర్, పలువురు సీఐ లు, ఆర్ ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఇండ్లు పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలి

Satyam NEWS

25న ముస్లిం సంఘాల రౌండ్ టేబుల్ సదస్సు

Satyam NEWS

ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను సత్కరించిన కళాశాల ప్రిన్సిపాల్

Satyam NEWS

Leave a Comment