38.2 C
Hyderabad
May 2, 2024 19: 23 PM
Slider వరంగల్

గేట్-2022 లో ర్యాంకు విద్యార్థులకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు

#errabelly

గేట్-2022 లో ఆలిండియా టాపర్ గా నిలిచిన వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి సందీప్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు.

గేట్-2022 లో దేశంలోని టాపర్ గా నిలిచిన వరంగల్ విద్యార్థి యంగ్ స్టర్ సందీప్ రెడ్డి అని ఆయన అన్నారు. అదేవిధంగా గేట్-2022 లో మెటలర్జీ  ఇంజనీరింగ్ లో 9వ స్థానం సాధించిన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం లోని చీకటాయపాలెంకు(పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం) చెందిన నిరంజన్ కు కూడా మంత్రి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వీరిద్దరూ ఉన్నత విద్య అభ్యసించి, ఉన్నత  స్థాయికి చేరాలని మంత్రి ఆకాంక్షించారు.

Related posts

తుఫాను హెచ్చరిక నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలి

Satyam NEWS

పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు సక్రమంగా జరిగేనా?

Satyam NEWS

కొల్లాపూర్ నియోజకవర్గ యువతి యువకులకు శుభవార్త

Satyam NEWS

Leave a Comment