హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి నామినేటెడ్ పోస్టు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడు సంతకం చేశారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో సుధీర్ రెడ్డి మూడేళ్లు కొనసాగుతారు.
previous post