ప్రముఖ సినీ హీరో డాక్టర్. రాజశేఖర్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ “మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు” అని అన్నారు.
previous post