23.7 C
Hyderabad
May 8, 2024 07: 05 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

విషమంగానే ఉన్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి

lata mangeshkar

ప్రముఖ గాయని లతా మంగేష్కర్(90) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. న్యుమోనియాతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు. ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున శ్వాస సంబంధ సమస్యలు ఎదురవడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని ముందుగా ఆమె కుటుంబ సభ్యులు భావిచాంరు కానీ అలాంటి పరిస్థితి లేదు. లతా మంగేష్కర్కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సంధానీ మాట్లాడుతూ లైఫ్ సపోర్టు యంత్రాల సాయంతోనే ఆమె శ్వాస తీసుకొంటున్నారని అన్నారు. న్యూమోనియా తో బాటు హృదయ సంబంధిత సమస్యలు కూడా తలెత్తినట్లు తెలిపారు. ఛాతీలో న్ఫెక్షన్ బాగా పెరిగి పోయిందని డాక్టర్ తెలిపారు. ఆమెకు చికిత్స జరుగుతున్నందున అభిమానులు ఎవరూ కూడా ఆసుపత్రికి రావద్దని, ఆమెకు సరైన వైద్యం అందే విధంగా అందరూ సహకరించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు.

Related posts

కో పిటీషనర్ అయిన నేను నిమ్మగడ్డను కలిస్తే తప్పేంటి?

Satyam NEWS

రాష్ట్ర స్థాయీ క‌బ‌డ్డీ పోటీల‌కు క్రీడాకారులు ఎంపిక‌…!

Satyam NEWS

సిమెంట్ పరిశ్రమ కార్మికులకు 8వ ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment