నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెరాస పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవితను ప్రకటించడం పట్ల లండన్ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి, జాగృతి యూకే సభ్యుడు నేడు నిజామాబాద్ మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి లో తనవంతు కృషి చేసిన కవిత ప్రజలతో మమేకం అవడానికి ఈ అవకాశం కలిసి వస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తామంతా లండన్ నుండి వచ్చి కవితకు ప్రచారం చేశామని వారు గుర్తు చేసుకున్నారు.
కవిత తెలంగాణ ఉద్యమంలో తోటి ఉద్యమ కారులకు తోడ్పాటుగా ఉంటూ తెలంగాణ సంస్కృతి ప్రచారంలో అగ్రగామిగా ఉన్నారని వారన్నారు. గతేడాది హైదరాబాద్ లో జరిపిన అంతర్జాతీయ యువత సదస్సు వల్ల రాష్ట్రానికి ఎనలేని ఖ్యాతి తెచ్చిన ఘనత కూడా కవితకే దక్కుతుందని వారు తెలిపారు. కవిత అభ్యర్థిత్వాన్ని స్వాగతించి సహకరిస్తున్న జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, జిల్లా ఎమ్మెల్యే లకు, ప్రజా ప్రతినిధులకు లండన్ ఎన్నారై ల తరపున ధన్యవాదాలు తెలిపారు.