కరోనా వైరస్ అనేది నిరంతరం ఉండే సమస్య. దాని కోసం ఎన్నికలను వాయిదా వేస్తారా అని ప్రశ్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాష్ట్రంలోని విద్యాసంస్థలను నిరవధికంగా మూసివేశారు. కరోనా సమస్యల అంత తీవ్రంగా లేదని, దాని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఆయన మూడు రోజుల కిందట చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఆ తర్వాత కరోనా కేసుల సంఖ్య పెరగడం తదితర కారణాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. కరోనాపై క్యాంపు కార్యాలయంలో నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా ఎఫెక్ట్ తో కోచింగ్ సెంటర్లతో సహా అన్ని మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.