28.7 C
Hyderabad
May 5, 2024 08: 48 AM
Slider హైదరాబాద్

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలపై రాస్తారోకో

#nvssprabhakar

అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారని తెలంగాణ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్,  వందలాది మంది మహిళలు తో కలిసి రామంతపూర్ లోని హైదరాబాద్- వరంగల్ జాతియ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఇళ్లు ఉన్న వారికే డబల్ బెడ్ రూమ్ ఇంళ్లు ను కేటాయిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ మేరకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ప్రధాన రహదారిపై  కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కొంతమంది బిజెపి శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.  ఇల్లు ఉన్నవారికి బిఆర్ఎస్ కార్యకర్తలకు, లంచాలు ఇచ్చే వారికి ఇల్లు ఇచ్చారని కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు అన్నారు. అధికార పార్టీ నేతలు తమకు నచ్చిన వారికే ఇల్లు కేటాయించారని తీరుస్తాయిలో మండిపడ్డారు. అర్హులైన వారికి   డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయించకుండా ఇల్లు ఉన్నవారికి బిఆర్ఎస్ కార్యకర్తలకు లంచాలు ఇచ్చే వారికి కేటాయిస్తున్నారని రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వస్తారనీ కార్పొరేటర్  ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో  ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

బంగారు తెలంగాణ పేరుతో మోసం: కార్పొరేటర్  కక్కిరేణి చేతన హరీష్

బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అందరినీ మోసం చేస్తుంది. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ అనేది ఎన్నికల స్టంట్ గా ఉపయోగిస్తున్నారనీ హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ అన్నారు. ఉప్పల్  నియోజకవర్గం లో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో  కొంత మందికే ఇల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి. లేదంటే బిజెపి ఆధ్వర్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతాం. ప్రజలను మోసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదనీ కార్పొరేటర్ తెలిపారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

జూన్ 28 నుండి జూలై 6వ వరకు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

Bhavani

పెండింగ్ పనులు తర్వగా పూర్తి చేయాలి

Satyam NEWS

ఆక్షన్:గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్

Satyam NEWS

Leave a Comment