31.2 C
Hyderabad
May 3, 2024 02: 27 AM
Slider ప్రత్యేకం

ఫెయిల్ అయిన విద్యార్థులకు సువర్ణ అవకాశం

#nationalschool

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఒఎస్), భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దీని ద్వారా 10వ, 12వ (ఇంటర్మీడియట్) తరగతుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఒరిజినల్ ఫెయిల్ మార్క్ షీట్ లేదా ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) ద్వారా ఎన్ఐఒఎస్ స్ట్రీమ్ 2 విధానం ద్వారా (10వ), సీనియర్ సెకండరీ (12వ) కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.

అంతేకాకుండా, ఏదైనా గుర్తింపు పొందిన ఎగ్జామినేషన్ బోర్డు నుండి 10వ, 12వ (ఇంటర్మీడియట్) పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు లేదా పరీక్ష రాయుటకు అర్హత కలిగి పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్ధులు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఒఎస్) ద్వారా స్ట్రీమ్ 2 (అక్టోబర్ 2022 లో పరీక్షలు) లో ప్రవేశం పొందుటకు అర్హులు. వీరికి తమ పూర్వపు బోర్డు పరీక్షలలో పాస్ అయిన సబ్జెక్టులలో, రెండు సబ్జెక్టుల  వరకు మార్కుల బదలాయింపు సౌకర్యం (ట్రాన్సఫర్ ఆఫ్ క్రెడిట్-TOC) కలదు. విద్యార్థులు కనిష్టంగా 5, గరిష్టంగా 7 సబ్జెక్టుల  వరకు ప్రవేశం పొందవచ్చు (TOC సబ్జెక్టులు కలుపుకొని).

ఎన్ఐఒఎస్ సెకండరీ  (10వ), సీనియర్ సెకండరీ (12వ) కోర్సులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు కలదు. ఈ కోర్సులలో పాస్ అయిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించుటకు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అర్హులు.

ఎన్ఐఒఎస్ స్ట్రీమ్ 2లో ప్రవేశములు జరుగుతున్నవి, కావున విద్యార్థులందరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ విలువైన సంవత్సర కాలాన్ని కోల్పోకుండా లబ్ది పొందాలని, సూచనలు, సలహాలు పొందడానికి లేదా ఆన్ లైన్ విధానం ద్వారా ప్రవేశం పొందడానికి, ఏదైనా ఇబ్బందులు ఎదురైనా ఎన్ఐఒఎస్ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్ ఫోన్ నెంబర్లు: 040-24752859 24750712  లను సంప్రదించాలని, మరిన్ని వివరాల కొరకు వెబ్ సైట్  https://nios.ac.in, https://sdmis.nios.ac.in లను దర్శించాలని ఎన్ఐఒఎస్ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్, ప్రాంతీయ సంచాలకులు అనిల్ కుమార్ తెలిపారు.

Related posts

ఐసోలేషన్ రూల్ మఠాష్: మా సారు దేవుడు కరోనా అంటుకోదు

Satyam NEWS

పార్టీలకు అతీతంగా కుల సంఘాల అభివృద్ధికి కృషి

Satyam NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న వనజీవి రామయ్య

Satyam NEWS

Leave a Comment