33.7 C
Hyderabad
April 28, 2024 00: 35 AM
Slider రంగారెడ్డి

పార్టీలకు అతీతంగా కుల సంఘాల అభివృద్ధికి కృషి

#kammasangham

కన్నుల పండుగ కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనం, ఆట,పాట ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

పార్టీల కతీతంగా కుల సంఘాల  అభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం చర్లపల్లి లోని శ్రీకృష్ణ కన్వెన్షన్ లో కాకతీయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్మ సంఘం కాప్రా, నాగారం, దమ్మాయిగూడ, కీసర విభాగాల కమ్మవారి కార్తీకమాస వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనం’ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

వేలాదిమంది కమ్మ సంఘం సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావుతో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమాసు భాస్కరరావు, మాజీ శాసనసభ్యులు, మాజీ చింతమనేని ప్రభాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో కుల సంఘాలు క్రియాశీలక పాత్రను పోషిస్తున్నాయని అన్నారు.

సమాజ శ్రేయస్సుకు సభ్యులు కృషి చేయాలని వెంకటేశ్వరరావు అన్నారు. సభ్యులంద సమైక్యంగా ఉండి ఓటు అనే ఆయుధంతో హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ కమ్మసంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు. కమ్మ సంఘం సభ్యులు సంఘటితమై సమాజానికి దశా దిశా చేయాలని సూచించారు.

మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మారిన పరిస్థితులకు అనుగుణంగా అన్ని విషయాల్లోనూ కుల సంఘాల పాత్ర పెరిగిందని గుర్తుచేశారు. పార్టీలకు అతీతంగా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈనెల 24వ తేదీన నగరంలోని ఖనా మెట్ లో రూ. 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్మ సంఘం భవన నిర్మాణాన్ని విజయవంతం చేయాలని పలువురు వక్తలు కోరారు.

తెలంగాణ కమ్మవారి సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంఘం గౌరవ అధ్యక్షులు ఇమేజ్ సివి రావు, అధ్యక్షులు అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో లక్ష మంది కమ్మ సోదరులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, ఎస్ వి. కృష్ణా ప్రసాద్, పోట్లూరు రామకృష్ణారావు, జనాబ్యోదయ సంఘం అధ్యక్షులు పోట్లూరు పాండురంగారావు, సిబిఆర్. ప్రసాద్, టిజికె. మూర్తి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, మన్నె సుబ్రహ్మణ్యం,

అడుసువెల్లి విజయకుమార్, ముప్పు శ్రీలత, నీరుకొండ సతీష్ బాబు, మన్నె సుబ్రహ్మణ్యం, సీహెచ్ సాంబశివరావు, ఉప్పలపాటి మధు, పిఎవి. ప్రసాద్, ఎన్. విశ్వేశ్వరరావు, మేకా ప్రసాద్, చనుమోల బోసు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

సో శాడ్: రాజధాని కోసం మరణించిన మరో ఇద్దరు

Satyam NEWS

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు

Bhavani

INTUC అనుబంధ యూనియన్లు జెండా ఆవిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment