పవిత్ర కృష్ణానది తీరాన శ్రీ వ్యాసరాలచే ప్రతిష్టించబడిన పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి వారికి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.గద్వాల కు చెందిన వకీల్ వెంకట్రావు, కమలాదేవి దంపతుల కుమారుడు మాజీ కౌన్సిలర్, అడ్వకేట్ భీమ్సేన్ రావు పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టు పీతాంబరాలను సమర్పించారు.
తమిళనాడులోని సేలంలో ప్రత్యేకంగా తయారు చేయించిన స్వామివారికి మడి పట్టు పీతాంబరాలను అమావాస్య గురువారం రోజు ఆలయ అర్చకులు చక్రపాణి, ఆలయ ధర్మకర్త గిరి రావుకి అందజేశారు. అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరింప చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు మన్నూరు ప్రసన్న చారి భక్తులు పాల్గొన్నారు.