19.7 C
Hyderabad
December 2, 2023 05: 34 AM
Slider ఖమ్మం

డబుల్ ఓట్లపై నిగ్గు తేల్చండి

#Congress Party

ఖమ్మం నియోజక వర్గ పరిధిలో ఉన్న డబుల్ ఓటర్ల జాబితా పై నిగ్గు తేల్చాలని కోరుతూ ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగర మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి కి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయ బాబు ఫిర్యాదు చేశారు. నియోజక వర్గ వ్యాప్తంగా ఐదు వేల కు పైగా ఓటర్ల పేర్లు రెండు వేర్వేరు పోలింగ్ బూత్ కేంద్రాల్లో నమోదై ఉన్నట్లు తాము గుర్తించామని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు.

వారు గుర్తించిన జాబితాను ఎన్నికల అధికారి కి అందచేశారు. ఈ సందర్భంగా మువ్వా మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో 3320 మంది ఓటర్ల పేర్లు ఇక్కడే ఉన్న రెండు వేర్వేరు పోలింగ్ బూత్ లలో నమోదై ఉండగా పాలేరు, మధిర, వైరా, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 2083 మంది ఓటర్ల పేర్లు అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పోలింగ్ బూత్ కేంద్రాల్లో ఓటర్లు గా నమోదై ఉన్నాయని తెలిపారు.

ఈ నేపధ్యంలో వీటిని పరిశీలించి వాటిని తొలగించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, కార్పొరేటర్ మలీదు జగన్, సర్పంచ్ మందడపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్మికుల పొట్టకొడుతున్న సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం

Satyam NEWS

అగ్రస్తానంలో రాహుల్

Murali Krishna

తుఫానును ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధం

Bhavani

Leave a Comment

error: Content is protected !!