27.7 C
Hyderabad
May 4, 2024 07: 35 AM
Slider మహబూబ్ నగర్

ఆక్రమణదారులకు అధికారులు వత్తాసుపలికితే ఏం చేయాలి???

#narayanpet

ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేస్తున్నారని తెలిస్తే ఏ అధికారి అయినా ఊరుకుంటాడా? కచ్చితంగా ఊరుకోడు. అధికారం ఉంటే తానే చర్యలు తీసుకుంటాడు, లేకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తాడు.

అంతే కదా?

అయితే నారాయణపేట్ లోని ఒక ఉన్నతాధికారి మాత్రం ఈ కబురు విని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు…..మనం నమ్మకపోయినా నారాయణపేట్ లో జరిగింది ఇదే.

నారాయణపేట్ లో స్టేడియం ఉండాలని స్థానికులు కోరడంతో మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ఆ పని జరిగేలా చేశారు.

జిల్లా కలెక్టర్ దగ్గరుండి  సుమారు 8 లక్షల రూపాయల బడ్జెట్ వెచ్చించి మరీ ఆ మినీ స్టేడియంకు  ప్రహరీ గోడ నిర్మించారు. ఆ స్థలంపై ఒక నాయకుడి కన్ను పడింది.

మరి తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ జేసీబీ తీసుకువచ్చి మినీ స్టేడియం ప్రహరీ గోడను అతను కూల్చేశాడు.

విషయం తెలుసుకున్న స్థానికులు నారాయణ పేట్ మునిసిపల్ వ్యవహారాలో కీలకమైన ప్రజాప్రతినిధికి దీన్ని వివరించి చెప్పారు.

తక్షణమే ఆయన తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారికి చెప్పారు. ఆ ప్రజా ప్రతినిది కూల్చివేత పనులు ఆపమని కోరారు.

నేనేమీ చేయలేను మీకు కావాలంటే అయితే మీరే స్వయానా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆ అధికారి ప్రజాప్రతినిధికి సూచించారు.

మున్సిపల్ స్టేడియం ను కాపాడాల్సిన అధికారి తనకేమి సంబంధం లేనట్లు వ్యవహరించటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి అధికారులను నియమిస్తుంటే ఈ అధికారి మాత్రం ఎప్పుడు భూసర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలాంటి అధికారులు ఉంటే ఏ ఒక్క ప్రభుత్వ భూమి కూడా మిగలదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Related posts

అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి

Satyam NEWS

ఏపి రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్

Satyam NEWS

తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేంద్రం

Satyam NEWS

Leave a Comment