26.7 C
Hyderabad
May 15, 2024 07: 39 AM
Slider ప్రత్యేకం

మంగళగిరి NRI ఆస్పత్రి స్వాధీనానికి ‘‘అధికార’’ కుట్ర

#NRI Hospital

మంగళగిరి NRI ఆస్పత్రిపై దుష్ప్రచారం వెనుక కుట్ర దాగి ఉందని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. మొత్తం 30 మంది డైరెక్టర్లు ఉండగా అందులో 20 మంది మంగళగిరి NRI ఆస్పత్రిని అమ్మడానికి సిద్ధంగా లేరు. అయితే ఈ ఆసుపత్రిని అధికార బలంతో ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తున్న కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని NRI ఆస్పత్రి డైరెక్టర్ బుచ్చయ్యచౌదరి ఆరోపించారు.

“NRI హాస్పిటల్ అమ్మటం మా డైరెక్టర్ లలో మెజారిటీ సభ్యులకు ఇష్టం లేదు. మూడు నెలల క్రితం అవినీతి జరిగిందని భావించి పిర్యాదు ఇచ్చాను. నెలక్రితం వాస్తవాలు తెలుసుకున్నాను. ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని అడుగుతుంటే ఇప్పుడు కుదరదు కోర్టు లో తెల్చుకోమని పోలీసులు సలహా  ఇచ్చినారు. NRI డైరెక్టర్ బోర్డ్ లో 30 మంది సభ్యుల్లో  20 మంది హాస్పటల్ అమ్మటానికి సిద్ధంగా లేరు.

గురువారం జరగబోయే సమావేశంలో మమ్మల్ని భయబ్రాంతులకు గురిచేయడానికి హాస్పిటల్ ను కైవసం చేసుకోవడానికి ఓ వర్గం  ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతున్నవి’’ అని ఆయన స్పష్టం చేశారు. NRI అకాడమీ పూర్వ అధ్యక్షుడు ముక్కామల అప్పారావు  తన స్వలాభం కోసమే నాడు తన చేత ఫిర్యాదు

చేయించాడని బుచ్చయ్య చౌదరి తెలిపారు. హస్పిటల్ చేతులు మారటానికి ప్రయత్నాలు చేపిస్తున్నారంటు ఇప్పుడు ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. NRI ఆసుపత్రిపై పోలీసులు దాడులు చేయడం, రికార్డులు స్వాధీనం చేసుకోవడం, అరెస్టులు చేయడం అంతా కుట్ర ప్రకారమే జరుగుతున్నదని డైరెక్టర్లు చెబుతున్నారు.

అధికార బలంతో అక్రమంగా ఆస్తులు స్వాధీనం చేసుకోవడం మంచి పని కాదని వారు అభిప్రాయపడుతున్నారు. NRI ఆసుపత్రిలో అక్రమాలు జరిగాయని నిన్న కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Related posts

కొడంగల్‌ నుంచి ఒక్కటే.. ఇల్లందులో 38 దరఖాస్తులు

Bhavani

తెలంగాణ విద్యారంగంలో మార్పులు తెస్తున్నాం

Satyam NEWS

విలేజ్ రెజ్లింగ్: బిచ్కుందలో కుస్తీ పోటీలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment