38.2 C
Hyderabad
May 2, 2024 21: 18 PM
Slider ముఖ్యంశాలు

పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఓజో ఫౌండేషన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి

#ojh

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అనేక పోటీ పరీక్షలకు ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో నిర్వహించబడే రఘు అన్న  చేయూత కార్యక్రమం ద్వారా భాగ్యనగర్ కోచింగ్ సెంటర్ లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన 1500 నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ అందించటంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమైయే సుమారు 2000 మంది విద్యార్థులకు మెటీరియల్స్ అందించారు.

నిరుద్యోగులకు ఎస్సై,కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ అందించడంతో పాటు ఇంటి వద్దనే ఉండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నియోజకవర్గం లోని యువతీ,యువకులకు సుమారు 600 సెట్ల కాంపిటేటివ్ మెటీరియల్ బుక్స్ అందజేసినట్లు ఓజో ఫౌండేషన్ ఇంచార్జి వెంకన్న తెలిపారు.మరల రెండవ దఫా మొత్తం 2000 మందికి మెటీరియల్ బుక్స్ అందజేయాలని నిర్ణయించి ఓజో ఫౌండేషన్ అధినేత రఘు పిల్లుట్ల ఆదేశాల మేరకు గురువారం హుజూర్ నగర్ కేంద్రంలోని ఓజో ఫౌండేషన్ కార్యాలయం నందు సుమారు 120 మందికి ఉచిత మెటీరియల్ బుక్స్ అందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ కుక్కల వెంకన్న మాట్లాడుతూ 1500 మంది విద్యార్థులకు అండగా ఉండి వారికి కావలసిన మెటీరియల్ అందించి వారిని ప్రోత్సహిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు ఓజో అధినేత కృషి చేశారన్నారని, రాబోయే పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించి ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ సభ్యులు,నిరుద్యోగ యువతీ,యువకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

కదులుతున్న రైలు నుంచి మహిళను తోసేసిన టిటిఇ

Satyam NEWS

సీఎం జగన్ ఫోటో కు పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే మేడా

Satyam NEWS

ప్రజల పన్నులను, ఆస్తులను దోచుకుంటున్న ఎమ్మెల్యే ద్వారంపూడి

Satyam NEWS

Leave a Comment