38.2 C
Hyderabad
May 2, 2024 20: 41 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ అపూర్వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

#oldstudents

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1987 – 88వ,సంవత్సరం 10వ తరగతి విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలను సోమవారం సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ కమిటీ సభ్యుడు యరగాని నాగన్న గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదయశ్రీ ప్రారంభించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఎంతోమంది తాము విద్యనభ్యసించిన పాఠశాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతూ తోడ్పాటు అందిస్తున్నారని,ఇది శుభ పరిణామం అన్నారు.ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులు అనేక మంది ఉన్నత స్థాయికి ఎదిగి స్థిర పడ్డారని, అలాంటి వారు వ్యక్తిగత అభివృద్ధితో పాటు తాము విద్యనభ్యసించిన పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు 1987-88వ,సంవత్సర బ్యాచ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

పాఠశాల అభివృద్ధిలో భాగంగా తరగతి గదుల రిపేర్,ప్రహరీ గోడ నిర్మాణం ప్రభుత్వం ద్వారా సాయం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యం.ప్రభాకర్,పూర్వ విద్యార్థులు చెన్నూరి విజయకుమార్,కంబాల శ్రీనివాస్,పెండ్యాల నాగరాజు, సాయిబాబు,సులువ యాదగిరి, చిల్లంచర్ల ఆనంద్,కుక్కడపు అనీల్ కుమార్,తండు రమేష్,కుక్కడపు కోటేశ్వరరావు,షేక్ జానీ పాషా,గొట్టె శ్రీనివాస్,కనకాంబర్,జక్కుల వెంకట్రావు,జె.సత్యనారాయణ, సురేష్, విజయ్,శంకర్,శ్రీను,మిర్యాల రమేష్,సుంకరి శ్రీనివాస్, పిడమర్తి చంద్రయ్య,హైమేష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

చీఫ్ ఇన్పర్మేషన్ కమీషనర్ గా ఆర్ యం భాషా ప్రమాణం

Bhavani

మర్డర్ ప్లాన్ ఇచ్చిన పోలీసోడు: రాసలీలల కథకు ముగింపు

Satyam NEWS

రియాక్షన్: తప్పు దిద్దుకుంటున్నారు సంతోషం

Satyam NEWS

Leave a Comment