30.3 C
Hyderabad
March 15, 2025 10: 51 AM
Slider సంపాదకీయం

రియాక్షన్: తప్పు దిద్దుకుంటున్నారు సంతోషం

Kanna JP Nadda

ఛీ ఛీ బీజేపీ శీర్షికతో సత్యం న్యూస్ నిన్న పోస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ బిజెపి అంతర్గత విషయాలపై కథనానికి పూర్తి స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. బిజెపిలో దిద్దుబాటు చర్యలు ప్రారంభం అయ్యాయి. బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వాన్ని రాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలుపై ప్రశ్నించడం, దానిపై వైసీపీ వివాదాస్పద నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేయడం తెలిసిందే.

కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి 20 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నాడని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అంతే కాకుండా తన విమర్శల పరంపరను ఆపకుండా ఎన్నికల సమయంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నిధులను స్వాహా చేశారని కూడా దారుణంగా ఆరోపించారాయన.

వీటన్నింటిపైన బిజెపి అగ్ర నాయకులు స్పందించలేదు. ఇదే విషయాన్ని సత్యం న్యూస్ ప్రస్తావించింది. దాంతో నిన్న రాత్రి, నేడు బిజెపి అగ్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణకు సంఘీభావం ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా కన్నా లక్ష్మీనారాయణ తో టెలిఫోన్ లో మాట్లాడారు.

పార్టీ ఆయన వెనుక ఉంటుందని, ఇదే విధంగా పోరాటం సాగించాలని ఆయన కు జె పి నడ్డా సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పై పోరాటంలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని కూడా నడ్డా స్పష్టం చేసినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. బిజెపి ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు అయిన మాధవ్, సోము వీర్రాజు కూడా కన్నా లక్ష్మీనారాయణతో ఫోన్ లో మాట్లాడారు.

వేరే వ్యక్తిగత పనుల వల్ల తాము స్పందించలేకపోయామని కన్నా లక్ష్మీనారాయణతో వారు చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ నియామకంలో ప్రధాన పాత్ర పోషించిన రాం మాధవ్ ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయన స్పందన మాత్రం ఇంకా రాలేదు.

అదే విధంగా రాజ్యసభ సభ్యుడు, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కూడా కన్నా లక్ష్మీనారాయణకు ఇప్పటి వరకూ సంఘీభావం వ్యక్తం చేయలేదు.

Related posts

భూముల కోసమే కామారెడ్డికి కేసీఆర్

Satyam NEWS

అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

దివ్య దీపోత్సవం!

Satyam NEWS

Leave a Comment