31.7 C
Hyderabad
May 2, 2024 10: 49 AM
Slider విజయనగరం

ప‌దిమంది చ‌ల్ల‌గా ఉండ‌టం కోసం…చ‌లి వేంద్రం ప్రారంభం…!

#parvatipuram

సేవా దృక్ఫ‌ధంతో ముంద‌డుగేసిన 1982 పార్వతీపురం ఆర్.సీ.ఎం బ్యాచ్

“ప‌దిమంది బాగు కోసం..ఒక్క‌డు మృతి చెందిన త‌ప్పు లేదు ..ఇది ఎన్టీఆర్ నటించిన సింహాద్రిలో సినిమోలోని డైలాగ్. కానీ…ప‌ది మంది చ‌ల్లాగాను వారి  దాహార్తని తీర్చ‌డం  కోసం…ఓ ముందుడుగేసింది….40 ఏళ్ల కి్తం టెన్త్ చ‌దివిని విద్యార్ధుల బ్యాచ్. అదే…1982 పార్వతీపురం ఆర్సీఎం బ్యాచ్.

దాదాపు  40 ఏళ్ల  క్రితం త‌మ‌కు పాఠాలు బోధించిన గురువులు చెప్పిన మాట‌ల‌ను ప‌దిలంగా వారివారి మెద‌డులో  నిక్షిప్త ప‌ర‌చుకున్నారు. నూటికో కోటికో ఒక్క‌రూ అని కాకుండా…దాదాపు…ప‌దిమంది ఒక్క‌ట‌య్యారు. అంతే త‌లో కొంత వేసుకున్నారు…అస‌లే వేసవి కాలం..ఆ పై మండే ఎండ‌లు.. ఎలాగో ఒక‌లాగ‌..ఏదో విధంగా స‌మాజానికి సేవ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇలా అనుకున్న త‌డ‌వు…ముంద‌డుగేసి..ఏపీలోని కొత్త‌గా ఏర్ప‌డ్డ .పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా కేంద్రంలోనే ఉన్న 1982 ఆర్సీఎం బ్యాచ్ లో కొంద‌రు క‌లిసారు. ఈ మేర‌కు అనుక‌న్న ప్ర‌కారం…ప‌ట్ట‌ణంలోని పండా వీధి మెయిన్ రోడ్డు గాయత్రి రెడీమేడ్ షాప్ వద్ద ఉచితంగా మజ్జిగ  పంపిణీకి శ్రీకారం చుట్టారు.

అంతే..మంచినీళ్లు  అదేనండీ చలివేంద్రానికి శ్రీకారం చుట్టారు.ప్ర‌స్తుతం మండుతున్న‌ వేసవి కాలం లో భానుడి భ‌గ‌భ‌గ‌ల  దృష్ట్యా ప్రతి  రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహ‌కులు… రెడ్డి శ్రీనివాసరావు, చింతాడ విశ్వం, రాంభట్ల శీను, కోట్మి శీనులు చెబుతున్నారు.

ఇక పార్వతీపురం యువసేన సేవా సభ్యులు కందుకూరి రాజేష్, పోలిశెట్టి కృష్ణ గారు, బోటు రామకృష్ణ మరియు యందవ  గణేష్ లు త‌మ వంతు సహాయ సహకారాలు అందజేశారు..ఈ సేవా కార్య‌క్ర‌మంలో యేర్నాగుల భాస్కర్,  బోటు గొల్ల‌రాజు,  తురుమల్ల రంగబాబు,  మీసాల కూర్మారావు, మహదేవ్ మురళి, చిలకలపల్లి ప్రకాష్ లు…ఆర్సీఎం టెన్త్ క్లాస్ బ్యాచ్ త‌రుపున ప‌దివేలు ఆర్థిక సహాయం అందించారు.

Related posts

ప్రశాంత డెల్టా ప్రాంతంలో వైసీపీ దాడులు

Satyam NEWS

కాలచక్రం

Satyam NEWS

దేశ రాజకీయాలలో టెక్‌ ఫాగ్‌ యాప్ చిచ్చు

Sub Editor

Leave a Comment