29.7 C
Hyderabad
May 6, 2024 05: 31 AM
Slider విజయనగరం

స్నేహ‌మేరా జీవితం…స్నేహ‌మేరా శాశ్వ‌తం…!

#oldstudents

స్నేహ‌మేరా జీవితం…స్నేహ‌మేరా శాశ్వ‌తం…!అన్నట్టుగా ప్ర‌తీ  ఒక్క‌రిలో విద్యార్ధి ద‌శ మ‌ధురానుభూతి.ఎన్నో జ్ఙాప‌కాలు..మ‌రెన్నో తీపి  గుర్తులు..ఇంకెన్నో చిలిపి వేషాలు.ఇవ‌న్నీ…వృద్దాప్య ద‌శ‌కు వ‌చ్చినా మ‌ర‌పురానివి, మ‌ర్చిపోలేనివి.

స‌రిగ్గా  1982లో ఏపీలో అదీ ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్వ‌తీపురం ఆర్.సీ.ఎం పాఠ‌శాల‌లో చ‌దువుకున్న విద్యార్ధులు…దాదాపు 40 ఏళ్ల త‌ర్వాత‌…అంటే ఈ ఏడాది 2022లో క‌లుసుకుందామ‌ని అనుకోవ‌డం జ‌రిగింది.ఈ న‌లభై ఏళ్ల‌లో..ఒక్కోక్కో విద్యార్ధి….కాల‌మాన ప‌రిస్థితుల‌లో ఎదుగుతూ..ప‌డుతూ..కుటుంబ బాధ్య‌త‌లుమోస్తూ…త‌లోక చోట స్థిర‌ప‌డ్డ‌వారే.

ఒకానోక సంద‌ర్బంలో..స‌ద‌రు  వ్య‌క్తులు…ప‌రిచ‌యం కావ‌డం…మ‌రికొంతమంది చిర‌కాలం పాటు…చ‌దివిన విద్యార్ధుల‌ను గుర్తుపెట్టుకోవ‌డం…న‌ల‌భై ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా క‌లుసుకోవాల‌ని అనుకున్నారు.అందులో భాగంగానే జిల్లాలోని పార్వ‌తీపురం శ్రీ వాసవి ఆర్య వైశ్య ఇండుపూరు వెంకటేశ్వరరావు కల్యాణ మండపంలో 40 ఏళ్ల‌ వేడుకలు జ‌ర‌గాయి.

ఈ  ఆత్మీయ పూర్వ విద్యార్ధుల స‌మావేశంలో  ఆర్.సి.యం పాఠశాల‌లో విద్యార్థులంతా  ఏక‌మ‌య్యారు.. కాగా ఈ సమావేశం పూర్వ విద్యార్థి కుప్పిలి జయ కుమార్ అధ్యక్షతన జరుగ‌గా..తోటిపూర్వ‌ స్నేహితులు తో కలసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు.

అందులో భాగంగానే.. ఈ ఏడాది   ఏప్రిల్ 10వ తేదీన‌ 1982 వ ఏడాది లో ఆర్.సి.యం పాఠశాలలో చదివిన విద్యార్థులు అందరూ,ఎక్క‌డున్నా…ఊ స్థితిలో ఉన్న కుటుంబ సమేతంగా కచ్చితంగా హాజరుకావాలని తీర్మానించారు   భవిష్యత్తులో తమ స్నేహితులతో  పార్వతీపురంలో మ‌రిన్న‌ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే తమ తోటి స్నేహితులు  ఏ కష్టాల్లో ఉన్న సామాజికంగా ఆర్థికంగా ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించారు. ఏదైనా..జీవ‌తంలో…విద్యార్ధి ద‌శ మ‌ర‌పురాని…మ‌రిచిపోనిదని అంటోంది స‌త్యం న్యూస్. నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

ఫ్లెక్సీ వార్: బీఆర్ఎస్ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ

Satyam NEWS

ఉపాధి హామీ పనులపై నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు

Satyam NEWS

Leave a Comment