28.7 C
Hyderabad
May 5, 2024 09: 02 AM
Slider తెలంగాణ

హై అలెర్ట్ :హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉద్రిక్తత

oldcity alert

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొందరు మెరుపు ధర్నాకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్‌ను వ్యాప్తి చేశారు. ఈ సందేశం పోలీసులకు చేరడంతో అలర్టైన పోలీసులు రంగంలోకి దిగారు.మసాబ్ ట్యాంక్, నెక్లెస్ రోడ్, ముసారాంబాగ్, బహదూర్‌పురా, కాచిగూడ క్రాస్ రోడ్స్, టోలిచౌకి ప్రాంతాల్లో బుధవారం రాత్రి 8 గంటలకు మెరుపు ధర్నాకు సిద్ధం కావాలని, ఇందులో భారీగా పాల్గొనాలని సందేశం వచ్చింది.

ఈ మెసేజ్ పోలీసులకు చేరడంతో ఏదో ఉపద్రవం జరిగేలా ఉందని అనుమానం వ్యక్తం చేసిన పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులు సివిల్ డ్రెస్‌లో మసీదులు, రద్దీ ప్రదేశాల్లో నిఘా పెట్టారు. హైదరాబాద్ పోలీసులతో సహా క్విక్ రియాక్షన్ టీమ్, టాస్క్ ఫోర్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్,సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ ప్లాటూన్స్‌ను దించారు.

Related posts

మైనర్ గిరిజన బాలికపై వైద్యుడి అత్యాచారం

Satyam NEWS

రాజన్న సన్నిధిలో తెలంగాణ సిఎం కేసీఆర్

Satyam NEWS

ఎమ్మెల్యే బొల్లా నుండి నాకు ప్రాణహాని ఉంది ..

Satyam NEWS

Leave a Comment