కీలక సమాచారం తో పోలీసులు ఉగ్రవాదుల దేన్గాను చుట్టుముట్టి కళ్లపులు జరపడం తో ఒక ఉగ్రవాది చనిపోగా పలువురు గాయవడ్డట్లు పోలీసులు తెలిపారు.జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు ఉగ్రవాదులను గుర్తించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఓ ఉగ్రవాది తప్పించుకోగా, మరో ఉగ్రవాది హతమయ్యాడు. హతమైన హిజ్బుల్ ఉగ్రవాదిని గుట్టా బెల్ట్ ప్రాంతానికి చెందిన హరూన్ వనీగా గుర్తించారు. తప్పించుకున్న మరో ఉగ్రవాది కోసం గాలింపు చేపట్టారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఏకే 47, మూడు మ్యాగజైన్లు, 73 రౌండ్లు, చైనీస్ గ్రనేడ్, రేడియో సెట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.