42.2 C
Hyderabad
May 3, 2024 18: 17 PM
Slider నిజామాబాద్

ఎంపీ బిబిపాటిల్ చొరవతో రెండు రోజుల్లో స్వగ్రామానికి మృతదేహం

ఎంపీ బిబిపాటిల్ ప్రత్యేక చొరవతో మాల్దీవ్స్ లో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహం రెండు రోజుల్లోనే స్వగ్రామానికి వస్తుందని కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మర్కంటి భూమన్న తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆపత్కాలంలో అండగా నిలుస్తుందని చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుర్మ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మర్కంటి భూమన్న, పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు ట్లాడుతూ.. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన వడ్ల రాజశేఖర్ అనే వ్యక్తి బ్రతుకు దెరువు కోసం మాల్దీవ్స్ వెళ్లాడన్నారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో రాజశేఖర్ మృతి చెందాడన్న విషయం తమకు తెలియడంతో ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్, ఎంపీ బిబిపాటిల్, జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డిలకు సమాచారం ఇవ్వడం రిగిందన్నారు.

ఎంపీ బిబిపాటిల్ తక్షణమే స్పందించి ఢిల్లీలో ఉన్న తన పిఎను మాల్దీవ్స్ పంపించి అక్కడి ఎంబస్సితో మాట్లాడించడం జరిగిందన్నారు. మాల్దీవ్స్ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో మృతదేహాన్ని బెంగుళూర్ కు తెప్పించడం జరిగిందని, అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్సులో సదాశివనగర్ కు రాజశేఖర్ మృతదేహాన్ని తీసుకురావడం జరుగుతుందన్నారు. నేటి రాత్రి తదేహం స్వగ్రామానికి వస్తుందన్నారు. మృతదేహం తీసుకురావడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఎంపీ బిబిపాటిల్ మంచి మనసుతో అందించి మానవతావాది అనిపించుకున్నారన్నారు. ఎంపీ సేవలు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు.

ఎంపీతో పాటు ఎమ్మెల్సీ కవిత, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, సహకరించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే జాజాల సురేందర్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సత్యనారాయణ, ప్రవీణ్, సాయికుమార్, తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోడు భూముల రైతుల కడుపుల పై పాలకుల పోటు

Satyam NEWS

తదుపరి చీఫ్ జస్టిస్ గా లలిత్ నియామకంపై రాష్ట్రపతి సంతకం

Satyam NEWS

రాములోరికి వాహనాలు

Murali Krishna

Leave a Comment