29.7 C
Hyderabad
May 3, 2024 06: 33 AM
Slider ప్రత్యేకం

తుఫానుప‌ట్ల అప్ర‌మ‌త్తం. .23వ తేదీన అల్పపీడనం…

#cyclone

రానున్న భారీ తుఫాను ప‌ట్ల జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి  హెచ్చరించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగము వారు అందజేసిన  సమాచారము ప్రకారం, అల్పపీడన ప్రాంతం ఉత్తర అండమాన్ సముద్రం, దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఉంటుంద‌ని తెలిపారు.

ఇది పశ్చిమ‌ వాయువ్య దిశగా కదిలి, అక్టోబర్ 22న తూర్పు మధ్య మరియు, ఆనుకొని వున్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా అల్పపీడనంగా మారి అక్టోబర్23న తీవ్ర అల్పపీడనం గా రూపాంత‌రం చెందే  అవకాశం వుందన్నారు. ఇది అక్టోబర్ 23 నాటికి పశ్చిమ మధ్య మరియు ఆనుకొని వున్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరం వైపు తిరిగి  తుఫాను గా మారే అవకాశం వుందని తెలిపారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతప్రజ‌లు తగు  జాగ్రత్తలు తీసుకోవాలని,  సచివాలయ  సిబ్బంది ద్వారా ఇప్ప‌టికే  సూచించిన‌ట్లు తెలిపారు.

సంబంధిత శాఖ‌ల‌ అధికారులు అందరికి ముందస్తు చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించిన‌ట్లు తెలిపారు.  జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకొనుట వలన జిల్లా ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రజలందరూ అప్రమత్తంగా వుంటూ జిల్లా యంత్రాంగానికి సహకరించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

తుఫాను స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాత భ‌వ‌నాలు మరియు శిథిలావ‌స్థ‌లో ఉన్న‌ భ‌వ‌నాలు కు ప్రజలు దూరంగా ఉండాలి.

వాతావ‌ర‌ణ హెచ్చ‌రిక‌ల‌ను చూస్తూ, తుఫాను తీవ్ర‌త‌ను తెలుసుకొని జాగ్ర‌త్త‌గా ఉండాలి.

లోత‌ట్టు ప్రాంతాల్లో ఉండే వారు ముందు జాగ్ర‌త్త‌గా ఎత్తైన ప్ర‌దేశాల్లోకి వెళ్లి ఉండ‌డం మంచింది. ఆల‌స్యం చేయ‌కుండా సురక్షిత ప్ర‌దేశాల్లో ఉండాలి. న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఉండే వారు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండేలా సుర‌క్షిత ప్రాంతానికి వెళ్లాలి.

రోడ్డుపై వ‌ర్షం బాగా ప‌డి వ‌ర‌ద పారుతున్న‌ప్పుడు రోడ్డుపై న‌డ‌వ‌క‌పోవ‌డం మంచిది.

మీరు ఉన్న ప్రాంతం సురక్షితంగా ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాన్ని వ‌దిలివెళ్లవ‌ద్దు.

రోడ్డుపై ఉండే కరెంటు స్తంబాలనుమరియు వేలాడుతున్న తీగ‌లను తాకరాదు.

మత్స్యకారులు ఎవరు కూడా సమద్రములోనికి వేటకు వెళ్ళ రాదు. సముద్రంలో ఇది వరకే వేటకు వెళ్ళిన మత్స్యకారులును వెనుకకు రప్పించుటకు తగు చర్యలు తీసుకో వలసిందిగా ఫిషరీస్ డిపార్టుమెంటు వారిని ఆదేశించడమైనది.

విజయనగరం జిల్లా కలక్టరు వారి కార్యాలయము, రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయాల్లో,    అన్ని తహసీల్దార్ కార్యాలయములలో కంట్రోల్ రూములు  ఏర్పాటు చేయుట జరిగినది.  తుపాను సమయం లో ఎటువంటి సమస్యలు ఉన్న క్రింద తెలుపబడిన కంట్రోల్ రూమునకు సంప్రదించవలసిందిగా కోరడమైనది.

కంట్రోలు రూము నెంబ‌ర్లు

జిల్లా కలక్టరు వారి కార్యాలయములో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-236947.

రెవెన్యూ డివిజినల్ అధికారి, విజయనగరం వారి కార్యాలయములో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు08922-276888

రెవెన్యూ డివిజినల్ అధికారి, చీపురుపల్లి  వారి కార్యాలయములో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు9440717534

రెవెన్యూ డివిజినల్ అధికారి, బొబ్బిలి వారి కార్యాలయములో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు08944 – 247288

తీర ప్రాంత మండలాలు అయినభోగాపురం, పూసపాటిరేగ తహసీల్దార్ వారి  కార్యాలయములలో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరుభోగాపురం: 9494354444, పూసపాటిరేగ :7989821849

మత్స్యశాఖ, విజయనగరం  వారి కార్యాలయములలో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-273812

విద్యుత్ శాఖ, విజయనగరం  వారి కార్యాలయములలో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 9440812824

Related posts

బహరైన్ లో విరిసిన తెలంగాణ పూల సంబురం

Satyam NEWS

మహిళా ఉద్యోగిపై దాడి చేసిన టిఆర్ఎస్ నాయకుడ్ని కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

బిజెపి నేతలపై హత్యాయత్నం చేసింది వైసీపీ రౌడీలే

Bhavani

Leave a Comment