వైద్యం కోసం ఆసపత్రికి వెళుతున్న వృద్ధ దంపతులను వెనక నుంచి వచ్చిన కావేరీ బస్సు ఢీకొనడంతో ఒకరు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నంలోని శ్రీనగర్ ఎస్. ఆర్ . ఎమ్. టి దగ్గర ఈరోజు ఉదయం సుమారు 6:30 కి ఈ యాక్సిడెంట్ జరిగింది. వివరాల్లోకి వెళితే ద్విచక్ర వాహన దారుడు ఫ్యామిలీతో కూర్మన్నపాలెం ఇంటి దగ్గర నుంచి విశాఖ కేర్ హాస్పిటల్ కి చికిత్స కోసం బయల్దేరారు.
మార్గమధ్యంలో శ్రీనగర్ దగ్గర వచ్చేసరికి కావేరీ బస్సు వెనక నుంచి వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. బైక్ పై వెనక కూర్చున్న భార్య కిందపడి తలకి బలమైన గాయం అవడంవల్ల అక్కడే చనిపోయారు. వెంటనే ఎస్సై గణేష్ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కావేరి బస్సును, బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన ఆవిడ పేరు కీర్తి వయసు సుమారు గా 43 సంవత్సరాలు ఉంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.