38.2 C
Hyderabad
April 29, 2024 11: 09 AM
Slider విజయనగరం

ధరలు స్థిరంగా ఉండి, రానున్న సంవత్సర కాలమంతా సుఖం

#kolagatla

వైఎస్ఆర్సీపీ  ఉత్త‌రాంధ్ర క‌న్వీనర్,ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల నివాసంలో పంచాంగ శ్ర‌వ‌ణం శుభ‌కృత్  నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని విజ‌య‌నగ‌రం   శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఉగాది సందర్భంగా త‌న స్వగృహంలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం శాసనసభ నియోజకవర్గం ఆధ్వర్యంలో లో ఉగాది వేడుకలు ఘనంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా పండితులు బ్రహ్మశ్రీ వారణాసి దుర్గా రావు శర్మ పంచాంగ శ్రవణాన్ని వివరించారు.

రానున్న ఏడాది కాలంలో జరుగు శుభాశుభాలను విశదపరిచారు.  వివిధ రాశుల వారి ఆదాయ, వ్యయాలు ఆరోగ్యం, అభివృద్ధి,  వాతావరణ అనుకూలతలు, ఇత్యాది అంశాలను వెల్లడించారు. ధరలు స్థిరీకరణ గా ఉండి, రానున్న సంవత్సర కాలమంతా సుఖంగా ఉంటుందని చెప్పారు.

పంచాంగ శ్రవణం అనంతరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విజయపరంపర గా  కొనసాగాలని ఆశిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.

ఎవరికీ ఎటువంటి కష్టనష్టాలు కలగకుండా అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ పయనించాలని అందుకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ కష్టసుఖాలలో  పాలుపంచుకుంటున్నారని అన్నారు.

అదే ఒరవడి కొనసాగుతూ రానున్న రోజుల్లో ప్రజలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి,  పార్టీ సీనియర్ సిటిజన్ విభాగం జిల్లా నాయకులు కే.వి.వి. కృష్ణారావు,నగర  పార్టీ అధ్యక్షులు.ఆశాపు వేణు,సీనియర్ కార్పొరేటర్ ఎస్ వి వి రాజేష్, పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ బంగారు నాయుడు,ఏ ఏం సి చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్  అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

పబ్ కల్చర్: బీరు బాటిళ్లతో రాహుల్ సిప్లిగంజ్ పై దాడి

Satyam NEWS

ఎలిగేషన్: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది

Satyam NEWS

జగన్ రెడ్డికి వణుకు పుట్టిస్తున్న సీ ఓవర్ సర్వే

Satyam NEWS

Leave a Comment