కడప జిల్లా ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మనోహర్ అనే అతడు స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. అతను పురుగుల మందు తాగబోతు౦డగా పోలీసులు అడ్డుకున్నారు.
తన చిన్నాన్న లక్ష్మీ మూర్తి పెట్టిన కేసు విషయంలో విచారణలో భాగంగా మనోహర్ ను స్టేషన్ కు పోలీసులు పిలిచారు. దీన్ని తట్టుకోలేక మనోహర్ ఈ పని చేశాడు. తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని అందుకే ఇలా చేశానని చెబుతున్నాడు మనోహర్