దొంగతనం చేయాలనీ ఒకరు వారిని పట్టుకోవాలని మరొకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండగా అంతిమ విజయం పోలీస్ లాడే అవుతుంది.మిక్సీలో 1,725 గ్రాముల బంగారాన్ని దాచి దుబాయ్ నుంచి తీసుకొచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకుని, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడు మిక్సీని తెచ్చాడు. అనుమానం వచ్చిన అధికారులు మిక్సీ విడి భాగాలను వేరుచేసి పరిశీలించగా 1,725 గ్రాములు బంగారం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.