26.2 C
Hyderabad
July 23, 2024 19: 10 PM
పశ్చిమగోదావరి

ఏలూరులో ఒక వ్యక్తి దారుణ హత్య

ఏలూరు 3టౌన్ పరిధి ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహాదారి   బ్రిడ్జి క్రింద ఒక వ్యక్తి  దారుణ హత్య కు గురయ్యాడు. నిర్మాణుష్యమైన స్దలంలో బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. తలపై తీవ్రగాయాలతో కొనూపిరితో ఉన్న వ్యక్తిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసు వాహనంలో తరలించారు.

ఏలూరు 3టౌన్ CI M.R.L.S. మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు ఏలూరు రూరల్ తిమ్మారావు గూడెంకు చెందిన గొవ్వాడ కృష్ణ గా పోలీసులు గుర్తించారు. 40 ఏళ్ల అతను ఏలూరు SBI  యిన్ బ్రాంచిలో అవుట్ సోర్సింగ్ స్వీపర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు‌ గుర్తించారు. సంఘటనా స్దలానికి చేరుకుని ఏలూరు DSP ఓ దిలీప్ కిరణ్ వివరాలు సేకరించారు.

Related posts

25న దెందులూరు రానున్న ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

ఏలూరులో ఘనంగా ఫాదర్ మోజెస్ జన్మదినోత్సవం

Satyam NEWS

అసలే అధికార పార్టీ… అందులోనూ రౌడీ షీటర్…

Satyam NEWS

Leave a Comment