25.2 C
Hyderabad
October 15, 2024 11: 47 AM
Slider తెలంగాణ

పోలీసుల పెట్రోలు సాయంపై నెటిజన్ల ప్రశంసలు

police petrole

ప్రయాణం మధ్యలో పెట్రోలు అయిపోయిందంటూ ఓ యువతి 100కు డయల్ చేసింది. ఈ ఫోన్ కు పోలీసులు స్పందించి పెట్రోలు తెచ్చి పోశారు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. రాచకొండ పోలీసులు ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

వరుస అత్యాచార ఘటనలతో ఉలిక్కిపడిన హైదరాబాద్‌లో  పోలీసులు ఇప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ గా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రాచకొండ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ యువతి డయల్ 100కు కాల్ చేసి బండిలో పెట్రోలు అయిపోయి ఇబ్బంది పడుతున్న విషయం తెలిపింది.

వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోలు బాటిల్‌తో యువతి వద్దకు చేరుకున్నారు. స్కూటీలో వాహనం పోసి జాగ్రత్తలు చెప్పి పంపించారు. రాచకొండ పోలీసులు ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. యువతి ఫోన్‌‌కు స్పందించి సాయం చేసిన పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Related posts

చలో రాజ్ భవన్ కు కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS

కాపు సంఘం ఆధ్వర్యంలో కోలా నాగేశ్వరరావుకు ఘన సన్మానం

Satyam NEWS

కేసీఆర్, రేవంత్ రెడ్డి గెలిస్తే లోకల్ గా ఉండలేరు

Satyam NEWS

Leave a Comment