అంబర్ పేట చే నంబర్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో చే నంబర్ చౌరస్తాలో వాహనాల రాకపోకలు నిషేదించడంతో ప్రజలు, అక్కడి వ్యాపార సముదాయాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చే నంబర్ చౌరస్తా వద్ద అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో సమావేశమై ప్రజలకు, అక్కడి వ్యాపారస్తులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డుకి ఒక వైపు రాకపోకలకు దారి సుగుమం చేయాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్