21.7 C
Hyderabad
December 2, 2023 04: 30 AM
Slider ముఖ్యంశాలు

చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి

#CPI

కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. బిజెపి లాంటి మతతత్వ శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఖమ్మం సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయుధపోరాట 75వవార్షికోత్సవాలను కమ్యూనిస్టు పార్టీ ఘనంగా నిర్వహిస్తుందన్నారు.

ఇటీవల కాలంలో చరిత్రను వక్రీకరించడంలో ముందు భాగాన నిలిచిన బిజెపి తెలంగాణ చరిత్రను కూడా వక్రీకరిస్తుందని తెలంగాణ సాయుధ పోరాటం భూమి, భూక్తి, విముక్తి కోసం జరిగిందని కానీ బిజెపి హిందు, ముస్లిం పోరాటంగా చూపించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అమితాకు తెలంగాణ సాయుధ వార్షికోత్సవాలతో ఏమి పని అని ఆయన ప్రశ్నించారు. కేవలం మత ఘర్షణలు సృష్టించేందుకే బిజెపి ప్రయత్నిస్తుందన్నారు. వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడుతున్నారని పటీల్ నిజాంతో యుద్ధం చేస్తే రాజ ప్రముఖ్ అని బిరుదు ఎందుకు ఇచ్చారని నర హంతకుడు ఖాసింరజ్విని సాధారంగా పాకిస్తాన్కు ఎందుకు పంపించారని సాంబశివరావు ప్రశ్నించారు.

రాజభరణాలు ఇచ్చి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించిందని సాయుధ పోరాటం పోసేత్తే హక్కు కమ్యూనిస్టులకు మినహా మరెవరికి లేదన్నారు. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆ తర్వాత బందగి తన రాతలతో చైతన్య పరిచి శిక్షకు గురైన సోయబుల్లాఖాన్ వీరంతా ముస్లింలు ఔనో కాదో తేల్చుకోవాలన్నారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాట ఫలితంగానే 10 లక్షల ఎకరాల భూమి పంచబడిందని మూడు వేల గ్రామాలు విముక్తి చెందాయన్నారు.

బిజెపి విముక్తి కానీ, కేసిఆర్ సమైక్యత కానీ ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు. 2001 వరకు త్రివర్ణ పతాకాన్ని గౌరవించని ఆర్ఎస్ఎస్ దాని ప్రధాన సంస్థ బిజిపి సమైక్యత గురించి, దేశం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బిజెపి ఉత్సవాలు, నినాదాల వెనుక కుట్ర దాగి ఉందన్నారు. నిజాం ప్రభుత్వం కంటే కాంగ్రెస్ వారే ఎక్కువమంది కమ్యూనిస్టులను చంపారని తెలిపారు. చనిపోయిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. సమైక్యత దినం ఎందుకో కేసిఆర్ చెప్పాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.

ఖాసింరజ్వీ స్థాపించిన ఎంఐఎం పార్టీని కొనసాగిస్తున్నారని వారికి కోపం వస్తుందనే కేసిఆర్ తన పంథాను మార్చుకున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలో గొంతు చించుకున్న కేసిఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కేసిఆరు తెలంగాణ ప్రజల కంటే తెలంగాణ ఓట్ల మీదే ప్రేమ ఎక్కువ అన్నారు. తెలంగాణ పోరాటాలు, బలిదానాల వెనుక ఉన్న త్యాగాలను కూడా వక్రీకరిస్తున్నారన్నారు. జమిలీ ఎన్నికలను సిపిఐ వ్యతిరేకిస్తుందన్నారు.

బలవంతపు జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య, స్ఫూర్తికి విరుద్ధమని సాంబశివరావు తెలిపారు. పాలకులు రాజ ధర్మాన్ని మరచిపోతున్నారని, ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారని ఆయన తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారని ఎఫ్ఎఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.

కవిత కేసును ప్రస్తావిస్తూ అవినీతి విషయంలో విపక్షాలకో నీతి, అధికార పక్షానికి మరొక నీతిని పాటించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. పొత్తులకు సంబంధించి సాంబశివరావు మాట్లాడుతూ పొత్తుల కోసం రాము వెంపర్లాడటం లేదని సానుకూలంగా చర్చలు జరిగినప్పుడు తగు రీతిలో స్పందిస్తామన్నారు.

మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేష్. రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, సిద్దినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

32,080 క‌రోనా పాజిటివ్‌, 402 మృతులు

Sub Editor

ప్రశాంతంగా గ్రూప్ -1 పరీక్ష

Satyam NEWS

మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్

Bhavani

Leave a Comment

error: Content is protected !!