38.2 C
Hyderabad
May 2, 2024 19: 16 PM
Slider ప్రపంచం

డబ్బులకు బదులు గోధుమలు…తాలిబన్ల కొత్త నిర్ణయం

కొన్ని నెలల క్రితం వరకు అభివృద్ధి వైపు మెల్లిమెల్లిగా అడుగులేసిన అఫ్గానిస్తాన్‌ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగం, ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఇటీవల పశ్చిమ కాబూల్‌లో ఎనిమిది మంది చిన్నారులు ఆకలితో చనిపోవడం అక్కడి దీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో అఫ్గాన్‌ ప్రజలను ఆదుకునేందుకు అక్కడి తాలిబన్ ప్రభుత్వం తాజాగా ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగం, ఆకలి చావులను నిరోధించేందుకు గాను ‘పనికి గోధుమల పంపిణీ’ని ప్రారంభించింది. అంటే పని చేసిన వారికి వేతనం బదులుగా గోధుమలను పంపిణీ చేయనుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు విస్తృతంగా కాలువల నిర్మాణం చేపడతామన్నారు.

Related posts

అన్ని కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం

Satyam NEWS

ఆంజ‌నేయుని జ‌న్మ‌స్థానం తిరుమల లోని అంజ‌నాద్రి

Satyam NEWS

ప్రమాదం చేయని డ్రైవర్లకు క్యాష్ అవార్డులు

Satyam NEWS

Leave a Comment