Slider కడప

కడప జిల్లాలో నేటి నుంచి ఆపరేషన్ ముస్కాన్

#kadapapolice

కోవిడ్ మహమ్మరి నుంచి వీధి బాలబాలికలు, బాల కార్మికులను, అనాధలైన పిల్లలను సంరక్షించేందుకు కడప జిల్లా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్.. కోవిడ్-19 చేపట్టారు. జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ అదేశాల మేరకు బుధవారం జిల్లా  వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్…. కోవిడ్-19 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా పోలీసు బృందాలు కడప జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ ల పరిధిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలైన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ లైన్, ఇతర  స్వచ్ఛంద సేవా సంస్థలు అధికారులు, ప్రతినిధులు, గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హోటల్లో,కిరాణ దుకాణాలు,ధాబాలు, వెల్డింగ్ షాప్, మెకానిక్ షాప్, పారిశ్రామిక వాడలో అనధికారికంగా పనిచేస్తున్న అనాధ బాలలను, నిసహాయలుగా తిరుగుతున్న వీధి బాల బాలికలను గుర్తించి కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాస్క్స్, శానిటైజర్ అందిస్తు, కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి శానిటైజర్ లతో వారి చేతులను శుభ్రపరిచి వారికి అల్పాహారాన్ని అందించి వారి తల్లిదండ్రుల ఆచూకీని తెలుసుకుని వారికి అవగాహన కల్పించి సదరు బాలబాలికలను వారి  తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు.

Related posts

కరోనా వైరస్ కట్టడిలో ప్రజలదే కీలక పాత్ర

Satyam NEWS

శివరాత్రి సందర్భంగా రామతీర్థం లో ఎన్సీసీ సేవలు

Satyam NEWS

‘‘యువగళం’’పాదయాత్రతో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం

Bhavani

Leave a Comment