38.2 C
Hyderabad
April 28, 2024 21: 08 PM
Slider కృష్ణ

‘‘యువగళం’’పాదయాత్రతో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం

#YuvagalamPadayatra

ఈనెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‘‘యువగళం’’పాదయాత్ర ప్రారంభంకానుంది. 400 రోజులు, 4000 వేల కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కోరారు. లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రభంజనం సృష్టించనుంది. పాదయాత్రతో జగన్‌ రెడ్డి అరాచక పాలనకు పతనం ఖాయం.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి కరువై యువత భవిష్యత్‌ ప్రశ్నార్థకమైంది. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో లక్షల ఖాళీలు భర్తీచేస్తాం, ప్రతి ఏటా జనవరి మొదటివారంలో నోటిఫికేషన్‌ ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఆశచూపిన జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. టీడీపీ హయాంలో యువతకు అందించిన రూ. 3 వేల నిరుధ్యోగ భృతినీ కక్షపూరితంగా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో యూత్‌ ఐకాన్‌ నారా లోకేష్‌ ‘యువగళం’ పాదయాత్ర యువతలో ఆత్మస్థైర్యం నింపి వారికి దిశానిర్దేశం చేయనుంది.

తీవ్ర నిరాశలో ఉన్న యువతను ఏకతాటిపై తెచ్చి వారిలో రాజకీయ చైతన్యం నింపనుంది. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరు. పండిరచిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు కుదేలయ్యాడు. మూడున్నరేళ్లలో ఒక్క పరిశ్రమనూ రాష్ట్రానికి తీసుకురాకపోగా జే ట్యాక్స్‌ వేధింపులతో పారిశ్రామిక వేత్తలను తరిమేశారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రశ్నార్థకమైంది. రాజధాని అమరావతిని చంపేశారు.

రాయలసీమలో అభివృద్ధిని అటకెక్కించారు. ఉత్తరాంధ్రను భూకబ్జాలతో దోచుకుంటునన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి నిలిచిపోయింది. జగన్‌ రెడ్డి ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యంతో మహిళలకు రక్షణ కరువైంది. కొండెక్కిన నిత్యావసర ధరలు, పన్నుల మోతతో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం భారమైంది. ఈ క్రమంలో ప్రజల్లో భరోసా నింపడంతో పాటు, మొత్తం రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు నారా లోకేష్‌ యువగళం ఒక వేదిక కానుంది. జగన్‌ రెడ్డి అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలను అక్కున చేర్చుకునేందుకు పాదయాత్ర వేదిక అవుతుంది. అన్నివర్గాల ప్రజల్లో ధైర్యం నింపి భరోసా నింపేందుకు దోహదపడుతుంది.

తెలుగుదేశం అధికారంలోకి రాగానే వారి సమస్యలను తీరుస్తారు. యువగళం పాదయాత్ర ప్రకటన తర్వాత రాష్ట్ర ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం శుభ పరిణామం. ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తుంటే యాత్ర ప్రభంజనం సృష్టించబోతోంది. ప్రతి ఒక్కరూ నారా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

Related posts

ఈ నెల 25 న ఏపీ రాష్ట్ర బంద్…!

Bhavani

జగన్ అక్రమాస్తుల కేసు డిసెంబర్ 6కి వాయిదా

Satyam NEWS

శ్రీశైల మల్లికార్జున సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

Satyam NEWS

Leave a Comment