38.2 C
Hyderabad
May 3, 2024 22: 26 PM
Slider ఆంధ్రప్రదేశ్

కొలాప్స్: చంద్రబాబునాయుడి పదవికి ఫొటో ఫినిష్

చంద్రబాబునాయుడు తనను తాను ప్రతిపక్ష నాయకుడుగా ప్రతి సారీ చెప్పుకోవడం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇష్టంగా అనిపించడం లేదు. ఎలాగైనా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా పోగొడితే ఇక ఆయన కు ఆ ప్రివిలేజ్  పోతుందని భావిస్తున్నారు.

అందుకు అవకాశం కూడా ఉండటంతో ఆయన వేగంగా ఆ దిశగా పావులు కదుపుతున్నారు. దీనికి ముహూర్తం గా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు పుట్టిన రోజు లేదా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ స్వీకారం చేసిన నాడు అంటే మే 28 లేదా 30వ తేదీలలో ఫిక్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

అందులో ఇప్పటికే ముగ్గురు తెలుగుదేశం పార్టీని దారుణంగా విమర్శించి వైసీపీ లో అనధికారికంగా చేరిపోయారు. ఇప్పుడు మరో ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు. వీరు కూడా వైసీపీలో అనధికారికంగా చేరిపోతే తెలుగుదేశం పార్టీ బలం అసెంబ్లీలో 18 కి పడిపోతుంది.

ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నందున ప్రతిపక్ష హోదా నిలబడాలంటే కనీసం 10 శాతం సీట్లు ఉండాలి. అంటే 18 సీట్లు ఉండాలి. ఇప్పుడు నలుగురు జెంప్ అయితే తెలుగుదేశం బలం 16కు పడిపోతుంది.

ఐదుగురు జెంప్ అయ్యే పరిస్థితి ఉంది. అదే జరిగితే చంద్రబాబునాయుడికి ప్రతిపక్ష హోదా పోతుంది. ప్రతిపక్ష హోదా పోతే 40 ఇయర్స్ ఇండస్ట్రీకి తల కొట్టేసినంత అవమానం జరిగినట్లే. ఇదే దిశగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తూ పావులు కదుపుతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయినందున ఇక యాక్షన్ ఒక్కటే మిగిలి ఉంది. గొట్టిపాటి రవి(అద్దంకి), ఏలూరి సాంబశివరావు(పర్చూరు), గంట శ్రీనివాసరావు(విశాఖ నార్త్) బాల వీరాంజనేయులు(కొండెపి) అనగాని సత్యప్రసాద్(రేపల్లె) తాజా జెంప్ లిస్టులో ఉన్నారు. వేచి చూడాలి. అనగాని సత్య ప్రసాద్ తాను పార్టీ మారడం లేదని ఖండించారు కానీ అనుమానమే.

Related posts

సంక్రాంతికి వస్తోన్న “అల్లుడు అదుర్స్” పెద్ద హిట్ అవ్వాలి

Satyam NEWS

మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ వేలంలో లక్షల పాట…

Satyam NEWS

పంజాబ్‎లో బొగ్గు కొరత.. తగ్గిపోయిన విద్యుత్ ఉత్పత్తి..

Sub Editor

Leave a Comment