38.2 C
Hyderabad
April 29, 2024 13: 15 PM
Slider మహబూబ్ నగర్

రియాక్షన్: అయ్యో దోచుకుందామనుకుంటే ఇలా అయిందే

#Kollapur Municipality

కొల్లాపూర్ మునిసిపాలిటీని కొల్లగొట్టేందుకు చేసిన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కరోనా పేరు చెప్పి కౌన్సిల్ సమావేశాన్ని టెలి కాన్ఫరెన్సు ద్వారా నిర్వహిద్దామనుకున్న కొల్లాపూర్ మునిసిపాలిటీ చైర్ పర్సన్ ఆటలకు నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మను చౌదరి అడ్డు చెప్పారు.

రేపు నిర్వహించబోయే ఆన్ లైన్ కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేయాలని అడిషనల్ కలెక్టర్ మను చౌదరి మునిసిపల్ కమిషనర్ కు తాఖీదు పంపారు. ఆన్ లైన్ లో కౌన్సిల్ సమావేశం నిర్వహించి తాము చేయాలనుకున్న అవినీతి పనులకు ఆమోదం పొందాలనుకున్న మునిసిపల్ చైర్ పర్సన్ వ్యూహాన్ని 11 మంది కౌన్సిలర్ లు కలెక్టర్ శ్రీధర్ దృష్టి కి తీసుకొని వెళ్లారు.

టెలికాన్ఫరెన్సు ద్వారా కాకుండా ప్రత్యక్ష పద్ధతిలోనే సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు. దాంతో ఆన్ లైన్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ ఆదేశాలను పాటించకుంటే సీఎం కేసీఆర్ కు, మున్సిపల్ శాఖ మంత్రి కే టి ఆర్ కు ఫిర్యాదు చేస్తామని కౌన్సిలర్ లు బాలస్వామి, రహీం పాషా, నయీమ్, మేకల రమ్య నాగరాజు, శిరీష కిరణ్ యాదవ్, కమిషనర్ వెంకటయ్య మీడియా సమావేశంలో తెలిపారు.

కరోనా పేరుతో ఆన్ లైన్ లో కౌన్సిల్ సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని పథకం పన్నడం, దానికి సంబంధించిన ఎజెండా ఖరారు కావడం సత్యం న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఎజెండాలో ఏ ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నారో కూడా సత్యం న్యూస్ వివరించింది. మునిసిపల్ చైర్ పర్సన్ ఆమోదం పొందాలనుకున్న బిల్లుల వివరాలను కూడా సత్యం న్యూస్ వెల్లడించింది.

Related posts

మహేష్ బాబు పుట్టిన రోజున అభిమానులు మొక్కలు నాటాలి

Satyam NEWS

నిజమైన దళితుల పట్ల ఏ మాత్రం కనికరం లేని కొల్లాపూర్ నేతలు

Satyam NEWS

విజయనగరం దండుమారమ్మ టెంపుల్ అన్న సమారాధన

Satyam NEWS

Leave a Comment