31.7 C
Hyderabad
May 7, 2024 00: 29 AM
Slider నిజామాబాద్

దేవాడ పుల్కల్, పెద్ద ఎడ్గి బ్రిడ్జి పరిశీలించిన విపక్ష నేతలు

#CPI Bichkunda

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండలం పెద్ద దేవాడ -పుల్కల్, జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి గ్రామం వద్ద నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జి లను గురువారం సి పి ఎం జుక్కల్ డివిజన్ కార్యదర్శి సురేష్ గొండ, బి ఎస్ పి నాయకులు గంగారాం పరిశీలించారు.

గతంలో ఇక్కడ లో లెవల్ వంతెనల కారణంగా వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉన్న కారణంగా ప్రభుత్వం గత 4సంవత్సరాల క్రితం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. మంత్రి హరీష్ రావు, ఎంపి బి బి పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ లు దానికి భూమిపూజ చేశారు. ఇది జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం తో ఈ ప్రాంత వాసులు ప్రతి యేటా వర్షాకాలం లో ఇబ్బంది పడుతున్నారు.

వర్షాకాలం ఈ బ్రిడ్జిల పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెనలు తెగిపోయి రాకపోకలు స్తంభించి పోతున్నాయి. అయిన ఇక్కడి ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే లు వీటి నిర్మాణం పూర్తి పై ఎలాంటి శ్రద్ద చూపకపోవడంతో ప్రజలకు శాపంగా మారిందని సి పి ఎం నాయకులు ఆరోపించారు.

ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ లకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన బిల్లులు చెల్లిస్తున్నారో లేదో తెలియదు కాని వీరి నిర్లక్ష్యం కారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలం లో  వాహనదారులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా నిన్న కురిసిన భారీ వర్షం కారణంగ పెద్ద దేవాడ -పుల్కల్, పెద్ద ఎడ్గి -మద్నూర్ వద్ద తాత్కాలిక వంతెనలు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించి పోయాయి.

దీంతో నిత్యం ఈ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర లకు సరిహద్దు లో ఉండడంతో రాకపోకలు సాగించే వ్యాపారస్తులు, వాహనదారులు తప్పనిసరిగా అదనంగా 12కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. కరొనా మహమ్మారి కారణంగా  ప్రస్తుతం విద్య సంస్థలు మూతపడి ఉండడం తో విద్యార్థులకు ముప్పు తప్పింది.

ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఆర్ అండ్ బి అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి అర్ధాంతరంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణం పనులను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు, వాహన దారులకు సౌకర్యం కల్పించాలని లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో నాయకులకు పిండ ప్రధానం పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమం లో బి ఎస్ పి నాయకుడు గంగారాం, ఎస్ ఎఫ్ ఐ నాయకులు కె. అజయ్, అఫ్రోజ్, మారుతీ రెడ్డి, గుండూర్ విట్టల్, గోవింద్, ఎడ్గి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజూర్‌నగర్ లో గుత్తా జన్మదిన వేడుకలు

Satyam NEWS

25 నుంచి తెలంగాణా ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌ సీజన్‌ 2 ప్రారంభం

Satyam NEWS

9 మంది విజయనగరం పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు

Satyam NEWS

Leave a Comment