38.2 C
Hyderabad
April 29, 2024 20: 41 PM
Slider విజయనగరం

9 మంది విజయనగరం పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు

#vijayanagaram police

సుదీర్ఘ కాలం విజయనగరం పోలీసుశాఖలో ఎంతో క్రమ శిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి  9 మంది ఉద్యోగులు పదవీవిరమణ చేశారు.

వారిలో (1) ఎస్ సి మరియు ఎటి సెల్-2 డిఎస్పీ ఎన్. రామారావు (2) విజయనగరం ట్రాఫిక్ ఎస్ఐ సయ్యద్ జియావుద్దీన్ (3) డిటిసి ఎస్ఐ జి. సూర్యప్రకాశరావు, (4) బొబ్బిలి ట్రాఫిక్ ఎస్ఐ ఎస్. అబ్రహం (5) కొమరాడ ఎస్ఐ జె. సత్యన్నారాయణ (6) నీలకంఠాపురం ఎ ఎస్ ఐ పి.కృష్ణ (7) ఆర్మ్డ్ రిజర్వు విభాగానికి చెందిన ఎఅర్ ఎస్ఐ లు టి.త్రినాధరావు (8) బి. చిన్నంనాయుడు (9) హెంగార్డు ఎస్.జగన్నాద నాయుడు ఉన్నారు.

వీరికి జిల్లా పోలీసుశాఖ తరపున జిల్లా ఎస్పీ రాజకుమారి జిల్లా పోలీసు కార్యాలయంలో  ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేస్తున్న తొమ్మిదిమంది అధికారులు సుదీర్ఘంగా నిష్కల్మషంగా సేవలందించి శాంతిభద్రతల పరిరక్షణలో పాల్గొన్నారని కొనియాడారు.

తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణలో పోలీసుశాఖకు వెన్నెముకగా నిలిచి, పోలీసు వ్యవస్థకు మంచి పేరును తీసుకొని వచ్చారన్నారు. సమాజ రక్షణ కోసం అన్ని వేళలా పోలీసు విధులను నిర్వహిస్తూ, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించి, ఎటువంటి రిమార్కులు లేకుండా ఉండటం గొప్ప విషయమన్నారు.

క్రమశిక్షణతో ప్రతిభావంతంగా విధులను నిర్వహించడంలో ఉద్యోగుల సతీమణులు పాత్ర ఎనలేనిదని కొనియాడారు.

కానిస్టేబుల్ స్థాయి నుండి క్రమశిక్షణతో విధులు నిర్వహించి, ఎఐ లుగా, పదోన్నతులు పొంది, పోలీసు శాఖకు సుదీర్ఘ కాలం సేవలిందరించారన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి దృష్ట్యా, ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతీ రోజూ యోగా, మెడిటేషను వంటివి చేపట్టి, ఆరోగ్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా ఎస్పీ రాజకుమారి సూచించారు.

ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు పోలీసుశాఖకు అందించిన సేవలను అదనపు ఎస్పీ పి.సత్య న్నారాయణరావు ఒఎస్డీ ఎన్.సూర్యచంద్రరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది కొనియాడుతూ, ప్రసంగించారు.

అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉద్యోగులు ఎస్ ఐ సయ్యద్ జియా ఉద్దీన్, జి. సూర్యప్రకాశరావు, ఎస్.అబ్రహం, జె.సత్యన్నారాయణ, ఎఎస్ఐ పి.కృష్ణ, ఏఅర్ ఎస్ ఐలు టి. త్రినాధరావు, బి. చిన్నంనాయుడు, హెూంగార్డు ఎస్. జగన్నాద నాయుడుల దంపతులను పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ రాజకుమారి సాలువలు, పూలమాలలు, పండ్లు, గిల్టు, పుస్తకాలు, నూతన వస్త్రాలు, జ్ఞాపికలతో సత్కరించి, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికారు.

అదే విధంగా జిల్లా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరుపున జిల్లా ఎస్పీ జ్ఞాపికలను, చెట్లను అందజేసారు. కోవిడ్ సమయం లో కూడా తమకు ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలకడం, సత్కరించడం తమ జీవితంలో ఎన్నటికీ మరువలేమని ఉద్యోగ విరమణ చేసిన అధికారులు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ సి మరియు ఎస్ సెల్-1 డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, సీఐలు సిహెచ్.రాజశేఖర్ రావు, బి.వెంకటరావు, ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాలు, రుద్రశేఖర్, సిహెచ్.శ్రీనివాసరావు, టిఎస్ మంగవేణి, ఆర్ ఐలు చిరంజీవి, పి.నాగేశ్వరరావు, పి. ఈశ్వరరావు, టి.వి.ఆర్.కె.కుమార్, మరియన్ రాజు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరావు, కో-ఆపరేటివ్ కార్యదర్శి నీలకంఠం నాయుడు, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొని, ఉద్యోగ విరమణ చేస్తున్న అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

కరోనా న్యూస్: క్లారిటీ ఇచ్చిన సత్యం న్యూస్

Satyam NEWS

రాజ్యాంగంలో అంబేద్కర్ ఆనాడే పొందుపరిచారు

Satyam NEWS

సాగునీటి వనరులు సద్వినియోగం చేసుకుందాం

Satyam NEWS

Leave a Comment