23.2 C
Hyderabad
May 8, 2024 00: 38 AM
Slider తెలంగాణ

సీపీ సర్ ఎన్‌కౌంటర్ల పేరుతో చంపకండి …అసదుద్దీన్ ఒవైసీ

owaisy contravarsy tweets disha encounter sajjanar

‘సీపీ సర్ మీరు ఏమైనా చేసుకోండి.. కానీ ఎన్‌కౌంటర్ల పేరుతో ఉదయం 5 గంటలకు మాత్రం చంపకండి. వీలైతే అరస్టు చేయండి.. థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించొచ్చు. సీపీ సర్ ఉగ్రవాదానికి మతం లేదు’ అని ట్వీట్ట ర్ వేదిక గా
సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌పై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇరాక్‌, ఇరాన్‌, అమెరికాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సైబరాబాద్ సీపీ తో వాదన కు దిగారు. ‘హైదరాబాద్‌లోని అమెరికా సాఫ్ట్‌వేర్ సంస్థల్లో జిహాదీలు పనిచేస్తున్నారా? అమెరికా ఆస్తులను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది.

హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించి అప్రమత్తమయ్యారా? సోదాలు జరుపుతున్నారా? లేదా నిస్సహాయ స్థితిలో ఉన్నారా?’ అంటూ ఒకరు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌లోని యూఎస్ కౌన్సిల్‌కు ప్రశ్నలు సంధించారు. దీనిపై సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి సమాధానం వచ్చింది.

‘అవును సర్… ఇటువంటి వాటిపై నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించి, జాగ్రత్తలు తీసుకోవడానికి మాకు ప్రత్యేక శాఖలు ఉన్నాయి. మా బృందాలు 24X7 గంటలు పనిచేస్తాయి. మమ్మల్ని అప్రమత్తం చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఏదైనా అనుమానాస్పంగా అనిపిస్తే మాకు సమాచారం అందిస్తూనే ఉండండి’ అని అందులో సైబరాబాద్ సీపీ ట్విట్టర్ ఖాతాలో రిప్లై ఇచ్చారు..

దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘అవును సర్ అంటూ హైదరాబాద్‌ సీపీ సర్ రిప్లై ఇస్తున్నారు. అటువంటి సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఎంతమంది జిహాదీలు పనిచేస్తున్నారు? దయచేసి చెబుతారా? లేదంటే అసలు మీ ఉద్దేశం ఏంటనే దానిపై కాస్త స్పష్టతనిస్తారా? మీరు భక్తులకే సమాధానం చెబుతారా? లేదంటే నాలాంటి ఎంపీకి కూడా చెబుతారా?’ అని ప్రశ్నించారు.

మొత్తానికి జిహాదీలు,ఉగ్రవాదులు ఉన్నారన్న సమాధానం తో ఎక్కడో కాలిన ఓ వై సి, సి పి తో ఇండైరెక్ట్ గా దిశా ఎన్కౌంటర్వి ను మర్శిస్తూనే సి పి తో ఆమీ తుమీ కి సిద్దపడటం గమనార్హం .

Related posts

ప్రభుత్వ వైఫల్యాలపై నిత్య పోరాటాలు

Satyam NEWS

మంచి పనులు చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

రిక్వెస్ట్: పిటిఐల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Satyam NEWS

Leave a Comment