విశాఖ మిలీనియం భవన్ కూడా మేమే నిర్మించాం. ఇప్పుడు జగన్ రాజధాని తరలిస్తున్నది అందులోకే… అంటూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అధికారులు మూడు ముక్కల రాజధాని చుట్టు తిరుగుతారు…ఇంకా ప్రజా సమస్యలపై ఏమి స్పందిస్తారు? అంటూ ఆయన సూటి ప్రశ్నివేశారు.
ప్రభుత్వం ప్రాంతల మధ్య చిచ్చు పెట్టవద్దని ఆయన హితవు పలికారు. రాజధాని అమరావతి కోసం జేఏసీ ఆధ్వర్యంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని లోకేష్ అన్నారు. రైతులు పంచెలు మాత్రమే కట్టుకోవాలి…ఫోన్ లు వాడకూడదా… మహిళ రైతులు మెడ లో మంగళసూత్రం వేసుకోకూడదా?
వైసీపీ ఎమ్మెల్యే కావాలని రైతులు ఆందోళన చేస్తున్న చోటకు వచ్చారు. కారుకి ఒక రాయి తగిలితే కేసులు పెడుతున్నారు. గుంటూరు, కృష్ణ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు రైతుల్ని కించపరుస్తున్నారు అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
16మంది రైతులను అన్యాయం గా అరెస్ట్ చేశారు. ఒకే రైతు పై 9 కేసులు బనాయించడం దారుణం. రైతుకి అండగా ఉంటామాని మాయ మాటలు చెప్పిన జగన్…రైతుల పైనే కేసులు పెడుతున్నారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.