30.7 C
Hyderabad
May 5, 2024 04: 06 AM
Slider మహబూబ్ నగర్

తెలంగాణ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రద్దు తగదు

#VemulaSrinivasareddy

రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు  రద్దు నిర్ణయం వెనుకకు తీసుకోవాలని కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి జిల్లా కొత్త కోట మండల తహశీల్దారు రమేష్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్రంలో లో టి ఆర్ ఎస్  ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత తొందరపాటు నిర్ణయాలు రైతుల పాలిటి శాపంగా మారుతున్నాయని చెప్పారు. వ్యవసాయాన్ని తీవ్రమైన సంక్షోభంలో పడేశారని, తీవ్రమైన పరిణామాలకు దారితీసేలా ఉంటున్నాయన్నారు.

గతంలో నియంత్రృంత్వగా, మొండిగా వ్యవసాయ విధానాన్ని అమలు చేయడం రైతులు నుండి వ్యతిరేకత వచ్చే సరికి ఆ విధానాన్ని రద్దు చేసుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో పంటలు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే రైతులు పండించిన పంటలను ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నించారు.  కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలతో దేశంలో వ్యవసాయం దారుణమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్న సమయంలో రాష్ట్రంలో పంటలు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే రైతులు చెమటోడ్చి  పండించిన పంటలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు.

 మార్కెటింగ్ చట్టం తో రాబోయే రోజుల్లో వ్యవసాయ మార్కెట్ లు ప్రవేటు మార్కెట్లతో దళారుల దోపిడీలతో పోటీపడలేక వ్యవసాయ మార్కెట్ లు మూతపడే పరిస్థితి వస్తే ఇంక వ్యవసాయం పూర్తిగా కార్పొరేటు వ్యాపారస్తుల చేతిలో విలవిలలాడుతోందని చెప్పారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ప్రారంభించిన ఇందిరా క్రాంతి పథకం కింద గ్రామాలలో పంటలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి పంటలు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చి భరోసా ఇచ్చిందని, కమిషన్ ఆధారంగా ఆ సంఘాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయని తెలిపారు.

పంటల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతుల తో ధర్నాలు చేసి అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పల్లె పాగు ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కృష్ణా రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరెందర్ రెడ్డి,

కొత్త కోట మాజీ సర్పంచ్ P. శ్రీనివాస్., కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోల్ల బాబ న్న, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సలీం ఖాన్., పి. రవింధర్ రెడ్డి, రాములు యాదవ్, నవీన్ కూమార్, మల్లెష్ యాదవ్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

కాటికి పోదామంటే దారి కరవాయే

Satyam NEWS

హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి

Satyam NEWS

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన గాజువాక ఏ ఎస్ ఐ

Satyam NEWS

Leave a Comment