37.7 C
Hyderabad
May 4, 2024 14: 07 PM
Slider ముఖ్యంశాలు

పద్మశాలీలు సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలి

#padmashali

పద్మశాలి  కులస్థులు ఐక్యతతో వ్యవహరించి విద్యాపరంగా, సామాజికంగా,  ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తద్వారా రాజకీయంగా ఎదగాలని  శాసనమండలి సభ్యుడు  ఎల్. రమణ పిలుపు ఇచ్చారు. స్థానిక  మార్కండేయ నగర్ లోని మార్కండేయ భవనంలో శనివారం జరిగిన కాప్రా పద్మశాలి సంక్షేమ సంఘం 30వార్షికోత్సవ వేడుకలలో ఆయన ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. 

ముఖ్య అతిథి గా  భారత్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రొప్రయిటర్  దొంతుల నర్సింగ్ రావు,  విశిష్ట అతిథి ,  తెలంగాణ  రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు  మేడ బాబూరావు లు పాల్గొని  నూ తన సంవత్సర 2022 క్యాలెండర్ ఆవిష్కరించారు.  సంఘ  అభివృద్ధికి ఆర్ధిక తోడ్పాటును అందిస్తున్న  సోమ రమేశ్ ,  తాటికొండ పట్టాభి,  తుమ్మ మాధవ రావు,    గోపి హిమశేఖర్ తదితరులు వార్షికోత్సవంలో పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా వార్షిక పరీక్షలలో ప్రతిభను కనబరచిన విద్యార్థులకు  పురస్కారాల ప్రదానం చేశారు.  గత ఏడాది పదవీ విరమణ చేసిన వారిని సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కుమారి డి. భావన  నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నల్ల అనిత పర్యవేక్షణలో దాండియా (కోలాటం)  నిర్వహించారు.  పద్మశాలి వధూవరుల పరిణయ పరిచయ వేదికలో పలువురు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.  పలువురు పద్మశాలి ప్రముఖులు  వార్షికోత్సవానికి

డి. దశరథ్ , కార్యదర్శి  కాప్రా పద్మశాలి సంక్షేమ సంఘం కార్యవర్గం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ధారణ మల్లయ్య వనం మాణిక్యం నారా జనార్ధన, కృష్ణ ,హరి, వనమాలి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

వైసిపిలోకి జెంప్ కాబోతున్న తిక్కవరపు

Satyam NEWS

భూకబ్జాదారునిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

సినీరంగంలో సరైన శిక్షణ వ్యక్తిత్వవికాసంలో ఒక భాగం

Satyam NEWS

Leave a Comment